పల్లెల్లో ఊపందుకుంటున్న ప్రచారం..
ABN , Publish Date - Dec 07 , 2025 | 12:41 AM
గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపి స్తుండడంతో పల్లెల్లో ఎన్నికల ప్రచారం ఊపందుకుం టోంది. పోటాపోటీగా అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ తమకే ఓటు వేయా లంటూ వేడుకుంటున్నారు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపి స్తుండడంతో పల్లెల్లో ఎన్నికల ప్రచారం ఊపందుకుం టోంది. పోటాపోటీగా అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ తమకే ఓటు వేయా లంటూ వేడుకుంటున్నారు. తాను గెలిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని, గ్రామ ప్రజలకు అం దుబాటులో ఉంటానని అనేక వాగ్దానాలు గుప్పిస్తు న్నారు. కొన్ని గ్రామాల్లో సాధ్యం కాని హామీలు ఇస్తూ ఓటర్లను ఆకర్శించేందుకు యత్నిస్తున్నారు. ఖర్చు చేయ డంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వ్యవసాయ పనుల సీజన్ కావడంతో పొద్దంతా రైతులు, మహిళలు ఇళ్లల్లో ఉండడం లేదు. వరి నాట్లు వేసేందుకు, పత్తి ఏరేందుకు వెళుతున్నారు. దీంతో అభ్యర్థులు తెల్లవారు జాము ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు.
మొదటి విడతలో మండలాలు...
జిల్లాలో 263 గ్రామ పంచాయతీలు, 2432 వార్డులు ఉన్నాయి. మొదటి విడతలో మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లోని 99 గ్రామ పంచాయతీల సర్పంచ్, 896 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ కోసం 471 మంది, వార్డు స్థానాల కోసం 2565 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 3న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయా నికి మంథని మండలం నాగారం, మైదుపల్లి, తోట గోపయ్యపల్లి, రామగిరి మండలం చందనాపూర్ గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. తోటగోపయ్యపల్లి సర్పంచ్‌తో పాటు ఆరు వార్డు స్థానా లు కూడా ఏకగ్రీవమయ్యాయి. ముత్తారం మండంలో 17 వార్డులు, కాల్వశ్రీరాంపూర్ 79 వార్డులు, మంథని మండలంలో 81 వార్డులు, కమాన్‌పూర్‌లో 11 వార్డులు, రామగిరి మండలంలో 23 వార్డులు ఏకగ్రీవం అయ్యాయని డీపీవో వీర బుచ్చయ్య తెలిపారు. దీంతో 95 పంచాయతీల సర్పంచ్ స్థానాలతోపాటు 98 పంచా యతీల్లోని 685 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ కోసం 376 మంది, వార్డు సభ్యుడి కోసం 1880 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
ప్రచారం ఇలా...
మొదటి విడత అభ్యర్థులకు గుర్తులు కేటాయించ డంతో డోర్ పోస్టర్లు, కరపత్రాలు, తదితర ప్రచార సామగ్రి ముద్రించుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. రెండో విడత ఎన్నికలు జరిగే అంతర్గాం, పాలకుర్తి, ధర్మారం, జూలపల్లి మండలాల్లో నామినేషన్ల ఉపసం హరణకు శనివారం నాటితో గడువు ముగిసింది. దీంతో పోటీ చేసే అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. సదరు అభ్యర్థులు ఆదివారం నుంచి ప్రచార పర్వంలో దిగను న్నారు. మూడో విడత ఎన్నికలు జరగనున్న సుల్తానా బాద్, పెద్దపల్లి, ఓదెల, ఎలిగేడు మండలాల్లో నామినే షన్ల పరిశీలన ముగియగా, ఈ నెల 9న ఉపసంహరణ అనంతరం గుర్తులు కేటాయించనున్నారు. మొదటి విడత పోలింగ్ ఈ నెల 11న, రెండో విడత 14న, మూడో విడత 17న పోలింగ్ జరగనున్నది.
ఫ ఇంటింటికి తిరుగుతూ..
జిల్లాలో ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల మధ్యనే పోటీ జరుగుతున్నది. కొన్ని చోట్ల బీజేపీ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. చాలా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఎంత బుజ్జగించినా కొంత మంది అభ్యర్థులు పోటీ నుంచి విరమించుకోలేదు. పోటీ బాగా ఉన్న చోట గెలిచే అభ్య ర్థులను తమ పార్టీలో చేర్చుకునేందుకు ఎమ్మెల్యేలు సంసిద్ధం అవుతున్నారు. కొన్ని చోట్ల గెలుస్తామనే ధీమా ఉన్న బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులు ముంద స్తుగానే అధికార పార్టీ ఎమ్మెల్యేలు. నేతల టచ్‌లోకి వెళుతున్నట్లు సమాచారం. ప్రచారంలో భాగంగా ఇంటిల్లిపాది తిరుగుతూ ఓటు అభ్యర్థిస్తున్నారు. కుల సంఘాల నాయకులను కలుస్తూ వారి మద్దతు కూడ గట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రామాల్లో యువకులను ఆకర్శించేందుకు సైతం యత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు గురించి వివరిస్తున్నారు. పింఛన్లు, రేషన్ కార్డులు మంజూరు చేయిస్తామని హామీలు ఇస్తున్నారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలకు చెందిన అభ్యర్థులు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి వివరిస్తున్నారు. కొందరు అభ్యర్థులైతే ఓటర్ల కాళ్లు మొక్కుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ఉండడంతో సదరు నాయకులు ఇంకా ప్రచార పర్వంలోకి దిగ లేదు. మంథనికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర ఐటీ, పరిశ్ర మల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బిజీ కావడంతో ఆయన ఎక్కువగా నియోజకవర్గానికి రావడం లేదు. ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో పరిస్థితులను తెలుసు కుంటూ అభ్యర్థులతో ఫోన్లలో మాట్లాడుతున్నారు. ఆయన సోదరుడు శ్రీనుబాబు నియోజకవర్గంలో తిరుగుతూ పార్టీ అభ్యర్థులకు సూచనలు చేస్తున్నారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం నేరుగా ఎన్నికల ప్రచారం చేపట్టడం లేదు. మండలాల వారీగా అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. నేరుగా తమ అభ్యర్థులను గెలిపించాలంటూ నాయకులు ప్రచార పర్వంలోకి దిగలేదు. మొదటి విడత ఎన్నికల ప్రచారానికి మరో మూడు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉన్నది. ప్రధాన గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గ్రామాల్లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్నది.