Share News

కాంగ్రెస్‌ హయాంలోనే తెలంగాణ సస్యశ్యామలం

ABN , Publish Date - Oct 21 , 2025 | 11:24 PM

కాంగ్రెస్‌ పార్టీ హయాంలోనే తెలంగాణ సస్యశ్యామలం అయ్యిందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. పట్టణంలోని ఎస్సారెస్పీ క్యాంప్‌ కార్యాలయం చుట్టు రూ.28.64 లక్షలతో నిర్మించ తలపెట్టిన ప్రహరీ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.

కాంగ్రెస్‌ హయాంలోనే తెలంగాణ సస్యశ్యామలం

సుల్తానాబాద్‌, అక్టోబరు21(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ హయాంలోనే తెలంగాణ సస్యశ్యామలం అయ్యిందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. పట్టణంలోని ఎస్సారెస్పీ క్యాంప్‌ కార్యాలయం చుట్టు రూ.28.64 లక్షలతో నిర్మించ తలపెట్టిన ప్రహరీ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ ఎస్సారెస్పీ ప్రాజెక్టును నాటి ప్రధాని నెహ్రూ చొరవతో నిర్మించినా, ఇందిరాగాందీ 1981లో ప్రారంభించారన్నారు. ఎస్సారెస్పీ, కాకతీయ మెయిన్‌, ఉప కాల్వల నిర్మాణంతో బీడు భూములు సాగుకు నోచుకొని సస్యశ్యామలం అయ్యాయని ఆయన గుర్తు చేశారు.

రూ.2 లక్షల రుణమాఫీ, కోతలు లేని ధాన్యం కొనుగోలు, సాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు, ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతూ అనుక్షణం రైతుల వెన్నంటి ఉంటున్నామన్నారు. త్వరలోనే సుల్తానాబాద్‌లోని ఎస్సారెస్పీ క్యాంపు ఆఫీసులకు నూతన భవనాలు నిర్మించేందుకు కృషి చేస్తామని చెప్పారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతటి అన్నయ్యగౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మినుపాల ప్రకాష్‌రావు, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ గాజుల లక్ష్మీరాజమల్లు, కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు పన్నాల రాములు, సింగిల్‌ విండో చైర్మన్‌ శ్రీగిరి శ్రీనివాస్‌, తుర్రికొండ రమాదేవి ప్రభాకర్‌, మెంగని శ్రీనివాస్‌, అబ్బయ్య గౌడ్‌, సతీష్‌, దామోదర్‌ రావు, కల్లేపల్లి జానీ, పడాల అజయ్‌ గౌడ్‌, కుమార్‌ కిషోర్‌, రాజయ్య, రాజు, రఫీక్‌, మోబిన్‌, కాంగ్రెస్‌ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, డీఈఈ మధుమతి, ఏఈ, ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - Oct 21 , 2025 | 11:24 PM