Share News

ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి

ABN , Publish Date - Jul 24 , 2025 | 11:56 PM

ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు గురువారం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ అన్ని క్యాడర్ల బదిలీలు, పదోన్నతుల షెడ్యుల్‌ విడుదల చేయా లన్నారు.

ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి

కమాన్‌పూర్‌, జూలై 24(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు గురువారం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ అన్ని క్యాడర్ల బదిలీలు, పదోన్నతుల షెడ్యుల్‌ విడుదల చేయా లన్నారు. జీహెచ్‌ఎం, స్కూల్‌ అసిస్టెంట్‌, పీఎస్‌ హెచ్‌ఎం ఖాళీలను పదోన్న తుల ద్వారా భర్తీ చేయాలని కోరారు. జీవో నెంబర్‌ 25ను సవరించి, ప్రతి పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులను ఉండాలని, 40 మంది విద్యార్థు లున్న ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండా లని సూచించారు. అన్ని రకాల పెండింగ్‌ బిల్లులు, రిటైర్డ్‌ పెన్షన్‌ బెనిఫిట్లు విడు దల చేయాలని పేర్కొన్నారు. యూఎస్సీసీ స్టీరింగ్‌ కమిటీ నాయకులు సదయ్య, రాజు, మల్లేశ్వర్‌ రావు, రమేష్‌, నంబయ్య, శంకర్‌, భరత్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎలిగేడు, (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పక్షాన డిప్యూటీ తహసీల్దార్‌ కిరణ్‌ కుమార్‌కు వినతి పత్రం ఇచ్చారు. అన్ని కేడర్ల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కాలపు జీతాలు చెల్లించాలన్నారు. యూఎస్‌పీసీ నాయకులు కుమారస్వామి, అప్పిడి సంతోష్‌ రెడ్డి, వెంకటేశ్వర్లు, రాములు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 24 , 2025 | 11:56 PM