టీబీ ఛాంపియన్ల శిక్షణ ప్రారంభం
ABN , Publish Date - Dec 10 , 2025 | 11:30 PM
గోదావరిఖని అడ్డగుంటపల్లిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం టీబీ ఛాంపియన్ల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ వాణిశ్రీ ప్రారం భించారు. డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ టీబీ వ్యాధి నిర్మూలనలో టీబీ చాంపియన్ల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.
కోల్‌సిటీ, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): గోదావరిఖని అడ్డగుంటపల్లిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం టీబీ ఛాంపియన్ల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ వాణిశ్రీ ప్రారం భించారు. డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ టీబీ వ్యాధి నిర్మూలనలో టీబీ చాంపియన్ల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. క్షయవ్యాధి గురించి ప్రజల్లో ఉన్న అపోహలను తొల గించి, మందులను సక్రమంగా వాడితే ఈ వ్యాధి పూర్తిగా నయమవుతుందని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా టీబీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ సుధా కర్ రెడ్డి ఆదేశాల మేరకు 12 ఆమ్ (ఆయు ష్మాన్ ఆరోగ్యం మందిర్) సెంటర్ల నుండి, అలాగే సింగిల్ ఆమ్ల నుండి కూడా టీబీ చరిత్ర కలిగిన 30మందిని ఎంపిక చేసి టీబీ చాంపియన్లకు శిక్షణ ఇచ్చారు. కార్యక్ర మంలో ఇంపాక్ట్ ఇండియా ప్రాజెక్ట్ స్టేట్ లీడ్ మిస్టర్ పురుషోత్తం, జిల్లా లీడ్ దేవోజు శ్రీనివాస్, టీబీ రిసోర్స్ పర్సన్ దాసరి అంజలి పాల్గొన్నారు.
జిల్లాలో టీబీ కేసులు తగ్గించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, అందు బాటులో ఉన్న సేవలు, పరీక్షలు, చికిత్స విధానాలను వారు వివరించారు. గతంలో టీబీ వ్యాధి వచ్చి పూర్తిగా కోలుకున్నవారిని టీబీ చాంపియన్లుగా ప్రకటించి, వారి అనుభవాలను ప్రజల్లో పంచుకునేలా ప్రోత్స హిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ అనంతరం ఆయా ఆమ్ సెంటర్ల పరి ధిలో గ్రామస భలు, మహిళా సం ఘాల సమావేశాలు, పాఠ శాలలు, సాం స్కృతిక కార్యక్ర మాలలో ప్రజలు ఎక్కువగా చేరే ప్రదే శాల్లో టీబీ చాంపి యన్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. టీబీ ఇన్ఫెక్షన్ కేసులు, మరణాలు తగ్గించేందుకు తమ వంతు పాత్రను నిబద్ధతతో కొనసా గిస్తామని తెలిపారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీరాములు, డీటీఓ డాక్టర్ కేవీ సుధా కర్‌రెడ్డి, జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ లక్ష్మీ భవాని, డాక్టర్ స్నేహలత, ఎన్‌టీఈపీ సిబ్బంది గోపి కృష్ణ, హెచ్‌ఇఓ, సిబ్బంది, హెల్త్ సూపర్‌వైజ ర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.