నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలి
ABN , Publish Date - Nov 14 , 2025 | 12:06 AM
మంథని నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం రామగిరి అతిథి గృహంలో ఇంజ నీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
రామగిరి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): మంథని నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం రామగిరి అతిథి గృహంలో ఇంజ నీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. డిసెం బరు 7 వరకు మిషన్ భగీరథ సంబంధించి పైప్‌లైన్ అభివృద్ధి పనులు, మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. నియోజకవర్గంలోని అడవి సోమన్‌పల్లి యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణం సకాలంలో పూర్తి కావాలని సూచించారు. మండలంలోని కేజీబీవీ కౌంపౌండ్ వాల్, ఆదర్శ పాఠశా లలు, ప్రభుత్వ పాఠశాలలో మంజూరు చేసిన అభివృద్ధి పనులను, పాఠశాలలో కంప్యూటర్, సైన్స్ ల్యాబ్, హాస్టల్ భవన నిర్మాణా పనులను వేగవంతంగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులో తీసుకొని రావాలని తెలి పారు. ఆర్డీవో సురేష్, ఈఈ మిషన్ భగీరథ శ్రీనివాస్, మిషన్ భగీరథ గ్రిడ్ అధికారి పూర్ణచందర్, సంబందిత అదికారులు పాల్గొన్నారు.