లీగల్ ఎయిడ్ క్లీనిక్‌ను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Dec 15 , 2025 | 11:59 PM
సీనియర్ సిటిజన్‌లు లీగల్ ఎయిడ్ క్లీనిక్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయ మూర్తి సునీత కుంచాల అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని జిల్లా సం క్షేమ అధికారి కార్యాలయంలో సీనియర్ సిటిజన్ లీగల్ ఎయిడ్ క్లీనిక్‌ను ప్రారంభించారు.
పెద్దపల్లి, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): సీనియర్ సిటిజన్‌లు లీగల్ ఎయిడ్ క్లీనిక్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయ మూర్తి సునీత కుంచాల అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని జిల్లా సం క్షేమ అధికారి కార్యాలయంలో సీనియర్ సిటిజన్ లీగల్ ఎయిడ్ క్లీనిక్‌ను ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవ ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమం దృష్టిలో పెట్టు కుని జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేశారన్నారు.
ప్రతీ సోమవారం ప్యానల్ న్యాయవాదులు ఎస్ అశోక్‌కుమార్, లీగల్ వలంటరీ ఎస్ మల్లేష్ అందుబాటులో ఉంటారని, పిల్లలతో సమస్యలు ఎదుర్కొం టున్న వృద్ధ తల్లిదండ్రులు ఇక్కడ ఫిర్యాదులు నమోదు చేయవచ్చని తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్, ఎఫ్‌ఆర్‌వో స్వర్ణలత, న్యాయ సేవ ప్రాధికార సంస్థ అధికారులు శేఖర్, అశోక్, పాల్గొన్నారు.