Share News

జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోండి

ABN , Publish Date - May 15 , 2025 | 11:52 PM

గోదావరిఖని జవహర్‌నగర్‌ సింగరేణి స్టేడియంలో ఈనెల 18న మెగా జాబ్‌మేళాను నిర్వహించనున్నట్టు ఎమ్మె ల్యే రాజ్‌ఠాకూర్‌ పేర్కొన్నారు. గురువారం క్యాంపు కార్యాలయంలో విలేక రులతో మాట్లాడారు. గ్లోబల్‌ ఎడ్యుకేషనల్‌ ఎంప్లాయిమెంట్‌ అసోసియేషన్‌, సింగరేణి సంయుక్తంగా మేళాను నిర్వహిస్తుందన్నారు.

 జాబ్‌మేళాను  సద్వినియోగం చేసుకోండి

గోదావరిఖని, మే 15(ఆంధ్రజ్యోతి): గోదావరిఖని జవహర్‌నగర్‌ సింగరేణి స్టేడియంలో ఈనెల 18న మెగా జాబ్‌మేళాను నిర్వహించనున్నట్టు ఎమ్మె ల్యే రాజ్‌ఠాకూర్‌ పేర్కొన్నారు. గురువారం క్యాంపు కార్యాలయంలో విలేక రులతో మాట్లాడారు. గ్లోబల్‌ ఎడ్యుకేషనల్‌ ఎంప్లాయిమెంట్‌ అసోసియేషన్‌, సింగరేణి సంయుక్తంగా మేళాను నిర్వహిస్తుందన్నారు. వందకు పైగా సంస్థలు పాల్గొంటుండగా 3వేలకుపైగా ఉద్యోగాల భర్తీ చేసే అవకాశం ఉందన్నారు. పదో తరగతి నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్‌, డిప్లోమా, ఐటీఐ తదితర అర్హతలు కలిగిన నిరుద్యోగ యువత పాల్గొనవచ్చునన్నారు. మెడి కల్‌ కళాశాల, ఆర్‌ఎఫ్‌సీఎల్‌, ఎన్‌టీపీసీ, సింగరేణితోపాటు హైదరా బాద్‌లోని పలు సంస్థల్లో నిరుద్యోగులకు అవకాశాలు కల్పించానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 18న జరిగే జాబ్‌మేళాకు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయని, నిరుద్యోగులు బయోడేటా, అర్హత సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డుతో హాజరుకావాల న్నారు. మరింత సమాచారం కోసం హెల్ప్‌లైన్‌ నెంబర్లు 9491144252ను సంప్రదించాలన్నారు. ఈ సందర్భంగా పోస్టర్‌ను ఆవిష్కరించారు. జీఎంలు లలిత్‌కుమార్‌, బండి వెంకటయ్య, ఏసీపీ రమేష్‌, కిరణబాబు, నాయకులు రాజేష్‌, మహంకాళి స్వామి, శ్రీనివాస్‌, తానిపర్తి గోపాల్‌రావు, పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2025 | 11:52 PM