ఉపాధిహామీ పనులను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Feb 17 , 2025 | 11:51 PM
వేసవిలో ఉపాధిహామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కాళిందిని అన్నారు. గర్రెపల్లిలో చెరువు వద్ద జరుగుతున్న ఫార్మేషన్ రోడ్డు పనులను సోమవారం పరిశీలించారు. ఉపాధిహామీ కూలీలతో మాట్లాడుతు అడిగిన వారందిరికీ పనులు కల్పిస్తామని, రోజుకు రూ.300 గిట్టుబాటు అయ్యేలా ప్రణాళికలు రూపొందించారని, ఆ మేరకు పనులు చేసి లబ్ధి పొందాలన్నారు.

సుల్తానాబాద్, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): వేసవిలో ఉపాధిహామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కాళిందిని అన్నారు. గర్రెపల్లిలో చెరువు వద్ద జరుగుతున్న ఫార్మేషన్ రోడ్డు పనులను సోమవారం పరిశీలించారు. ఉపాధిహామీ కూలీలతో మాట్లాడుతు అడిగిన వారందిరికీ పనులు కల్పిస్తామని, రోజుకు రూ.300 గిట్టుబాటు అయ్యేలా ప్రణాళికలు రూపొందించారని, ఆ మేరకు పనులు చేసి లబ్ధి పొందాలన్నారు. కూలీలు తప్పనిసరిగా ఆరో గ్య బీమా కలిగి ఉండాలన్నారు. గర్రెపల్లి నర్సరీని సందర్శించి మొక్కలను కాపాడుకోవడానికి వారానికి ఒకసారి వాటరింగ్ చేయాలని సూచించారు. వేప, రావి తదితర వృక్ష జాతి మొక్కలను ఎక్కవగా పెంచాలన్నారు. డీఆర్‌డీఏ వెంట ఈజీఎస్ ఏపీఓ మల్లీశ్వరి, ఏఈ రాజ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
ఎలిగేడు, (ఆంఽధ్రజ్యోతి): మహిళలు ఆర్థికాభివృద్ధిని పెంపొందించుకోవాలని జిల్లా గ్రామీ ణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ కాలిందిని అన్నారు. సోమ వారం ధూళికట్ట గ్రామాన్ని ఆమె సెర్ఫ్ అధికారులతో కలిసి సందర్శించారు. స్త్రీ నిధి, బ్యాంకు లింకేజీ ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి సంతృప్తి చెశారు. పిండిగిర్నీ, కిరాణం, బ్యాంగిల్ స్టోర్స్ ద్వారా లబ్ధిపొందిన వారి ఆర్థిక పరిస్థితిపై సెర్ఫ్ అధికా రులను అడిగారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన స్వశక్తి మహిళలు మరికొందరికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. అలాగే తీసుకున్న రుణాల రికవరీలో ముందుండాల న్నారు. స్త్రీ నిధి రుణాలు పొందిన మహిళలు నూతన ఒరవడిని సృష్టించాలని పేర్కొన్నారు. ప్రతీ స్వశక్తి మహిళకు 5లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తామని తెలిపారు. పొదు పులు, అప్పులు సక్రమంగా కట్టుకోవాలని, జాగ్రత్త లు పాటిస్తూ కుటుంబాలకు ఆదర్శంగా నిలవాల న్నారు. ఆమెతో ఐకేపీ ఏపీఎం సుధాకర్, మండల గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు రేణుక, సీసీలు జ్యోతి, ఆనంద్, మల్లేశం, శ్రీనిధి మేనేజర్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.