రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోండి
ABN , Publish Date - May 13 , 2025 | 11:35 PM
మండలంలోని శివపల్లి, ర్యాకల్ దేవ్‌పల్లి, లోకపేట్ గ్రామాల్ల్లో నిర్వ హిస్తున్న భూ భారతి రెవెన్యూ సదస్సులను జిల్లా రెవెన్యూ డివిజ నల్ అధికారి గంగ య్య సందర్శించారు. ఆయన శివపల్లిలో మాట్లాడారు.
ఎలిగేడు, మే 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని శివపల్లి, ర్యాకల్ దేవ్‌పల్లి, లోకపేట్ గ్రామాల్ల్లో నిర్వ హిస్తున్న భూ భారతి రెవెన్యూ సదస్సులను జిల్లా రెవెన్యూ డివిజ నల్ అధికారి గంగ య్య సందర్శించారు. ఆయన శివపల్లిలో మాట్లాడారు. రైతులు భూసమస్యలను పరిష్కరించడానికి భూభారతి చట్టంలో ప్రతీ సమస్యకు పరిష్కారం ఉందన్నారు. భూరికార్డులను పరిగణలోకి తీసుకొని ఫీల్డ్ ఎంక్వైరీ చేసి సమస్యలు వీలైనంత త్వరలో కలెక్టర్ ఆదేశాల మేరకు పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందన్నారు. మండలంలో ఈనెల 5 నుంచి ఇప్పటి వరకు 10 గ్రామాల్లో నిర్వహించిన భూభారతిలో రైతుల నుంచి 852 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. తహసీల్దార్ యాకన్న, డిప్యూటీ తహసీల్దార్‌లు కిరణ్‌కుమార్, తిరుపతి, ధీరజ్, ఆర్‌ఐలు జయలక్ష్మి, చంద్రశేఖర్, అనిల్, భూలక్ష్మి, రమ్య, స్వప్న పాల్గొన్నారు.