ఇసుక లభ్యతపై సర్వే రిపోర్టు త్వరగా ఇవ్వాలి
ABN , Publish Date - Sep 06 , 2025 | 11:55 PM
జిల్లాలోని మానేరు, గోదావరి నదుల్లో ఇసుక లభ్యతపై సర్వే రిపోర్టు త్వరగా ఇవ్వాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఇసుక లభ్యత సంబంధించి జిల్లా సర్వే నివేదికను రెవె న్యూ, గనులు భూగర్భ, టీజీఎండీసీ, భూగర్భ జల శాఖ, అటవీశాఖ, నీటిపారుదల శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు సంయుక్తంగా పరిశీలించి అక్టోబర్ 1వ తేదీ నాటికి ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు.
పెద్దపల్లి, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మానేరు, గోదావరి నదుల్లో ఇసుక లభ్యతపై సర్వే రిపోర్టు త్వరగా ఇవ్వాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఇసుక లభ్యత సంబంధించి జిల్లా సర్వే నివేదికను రెవె న్యూ, గనులు భూగర్భ, టీజీఎండీసీ, భూగర్భ జల శాఖ, అటవీశాఖ, నీటిపారుదల శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు సంయుక్తంగా పరిశీలించి అక్టోబర్ 1వ తేదీ నాటికి ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు. జిల్లా సర్వే రిపోర్టు ఆధారంగా ఇసుక క్వారీలను లీజుకు ఇస్తామన్నారు. ఇసుక తవ్వకాలకు పర్యావరణ అనుమతులు లభిస్తాయని, నిబంధనల ప్రకారం సర్వే రిపోర్టు కట్టుదిట్టంగా తయారు చేయాలని తెలిపారు. ప్రతి శాఖ తమకు సంబంధిం చిన నివేదికలను ఈనెల 15వ తేదీ లోపు అందజేయాలని, తద్వారా తుది నివేదిక అక్టోబర్ 1వ తేదీ నాటికి సిద్ధం చేస్తామన్నారు. మైనింగ్ ఏడీ పి శ్రీనివాస్, డీఎఫ్‌ఓ శివయ్య, భూగర్భ జల శాఖ ఏడీ జి లావణ్య పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల సర్దుబాటు
పారదర్శకంగా పూర్తి చేయాలి
పెద్దపల్లి కల్చరల్, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల సర్దుబాటు పారదర్శకంగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ పరిధిలో ప్రాథమిక పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయుల పదోన్నతుల కారణంగా హైస్కూల్‌కు వెళ్లిన నేపథ్యంలో ఏర్పడిన ఖాళీలను మండల, పక్క మండలం పరిధిలో అందుబాటులో ఉన్న ఉపాధ్యాయులతో సర్దుబాటు చేయాలని ఆయన తెలిపారు. జిల్లా విద్యాధికారి మాధవి, అకాడమిక్ మానిటరింగ్ అధికారి షేక్, ప్లానింగ్ కోఆర్డినేటర్ మల్లేశం గౌడ్, మండల శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.