Share News

అసాంఘిక శక్తులపై నిఘా

ABN , Publish Date - Jul 21 , 2025 | 11:44 PM

సంఘ విద్రోహ శక్తులపై పోలీస్‌ నిఘా ఉం టుందని, వారు పద్ధతులు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని గోదావరి ఖని వన్‌టౌన్‌ సీఐలు ఇంద్రసేనరెడ్డి, రవీందర్‌లు పేర్కొన్నారు. స్థానిక ఇందిరానగర్‌లో సోమవారం రాత్రి కమ్యూనిటీ కాంటాక్ట్‌ ప్రోగ్రాం నిర్వహించారు.

అసాంఘిక శక్తులపై నిఘా

కోల్‌సిటీ, జూలై 21 (ఆంధ్రజ్యోతి): సంఘ విద్రోహ శక్తులపై పోలీస్‌ నిఘా ఉం టుందని, వారు పద్ధతులు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని గోదావరి ఖని వన్‌టౌన్‌ సీఐలు ఇంద్రసేనరెడ్డి, రవీందర్‌లు పేర్కొన్నారు. స్థానిక ఇందిరానగర్‌లో సోమవారం రాత్రి కమ్యూనిటీ కాంటాక్ట్‌ ప్రోగ్రాం నిర్వహించారు. ఇండ్లలో సోదాలు నిర్వహించి అనుమానం ఉన్న వ్యక్తులను ప్రశ్నించారు. సరైన పత్రాలు లేని వాహనా లను సీజ్‌ చేశారు. శాంతినగర్‌ రోడ్డులో డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్‌ అధికారులు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి వచ్చి పని చేసుకునే వారు ఎక్కువగా ఇందిరానగర్‌లో నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నార న్నారు.

ఎవరైనా ఇండ్లు కిరాయికి ఇచ్చేటప్పుడు వారి వివరాలు, పని, ఎక్కడి నుంచి వచ్చారు, కుటుంబ సభ్యుల వివరాలు సరి చూసుకోవాలన్నారు. ఇందిరానగర్‌లో గం జాయి, మద్యానికి అలవాటు పడి కొందరు యువత పెడదారి పడుతున్నారని, వారి కుటుంబ సభ్యులు, స్థానికులు గమనించాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి రవాణా చేసేవారు, స్థానికంగా విక్రయించే వారు, సేవించే వారి వివరాలపై కేసులు నమోదు చేస్తామని, అలాంటి వారి సమాచారాన్ని పోలీసులకు ఇవ్వాలన్నారు. సైబర్‌ నేరగాళ్లు అమాయకులను మోసగిస్తున్నారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని, డ్రైవింగ్‌ లైసెన్స్‌లు, ఇన్సూరెన్స్‌ పత్రాలు కలిగి ఉండాలన్నారు. మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వవద్దని, వాహనాలు ఇస్తే యజమానులపై కేసులు నమోదు చేస్తామన్నారు. వన్‌టౌన్‌ ఎస్‌ఐ రమేష్‌, అనూష పాల్గొన్నారు.

Updated Date - Jul 21 , 2025 | 11:44 PM