Share News

అలుపెరుగని పోరాటయోధుడు సురవరం

ABN , Publish Date - Sep 05 , 2025 | 01:03 AM

కార్మిక, కర్షక వర్గాల కోసం సురవరం సుధాకర్‌ రెడ్డి అలుపెరుగని పోరాటం చేశారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం అధ్యక్షతన మొదటి కౌన్సిల్‌ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అలుపెరుగని పోరాటయోధుడు సురవరం

పెద్దపల్లి టౌన్‌, సెప్టెంబర్‌ 4 (ఆంధ్రజ్యోతి): కార్మిక, కర్షక వర్గాల కోసం సురవరం సుధాకర్‌ రెడ్డి అలుపెరుగని పోరాటం చేశారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం అధ్యక్షతన మొదటి కౌన్సిల్‌ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సురవరం సుధాకర్‌ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా కొరతకు బీజేపీ ప్రభుత్వమే కారణమని, తెలంగాణలో ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ఎరువుల కర్మాగారాన్ని మూసి వేశారని, దాని నుంచి ఉత్పత్తి వస్తే రైతులకు యూరియా కొరత తగ్గేదన్నారు.

కేంద్ర ప్రభుత్వం కర్మాగారాన్ని నిర్లక్ష్యం చేసి యూరియా కొరతకు కారణమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మంత్రులు యూరియా దిగుమతికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రైతులకు యూరియా అందేలా చూడాలని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటై 20 నెలలైనా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంలో విఫలమైందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఈనెల 11నుంచి 17 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు గౌతమ్‌ గోవర్ధన్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు మడ్డి ఎల్లా గౌడ్‌, వైవి రావు, కోడెమ్‌ స్వామి, ఎంఏ గౌస్‌, రామ్‌ చందర్‌, రాజారత్నం, కడారి సునీల్‌, మార్కాపురి సూర్య, బాలసాని లెనిన్‌, చంద్రశేఖర్‌, ఎం శంకర్‌, రమేష్‌, శ్రీనివాస్‌, తాళ్లపల్లి లక్ష్మణ్‌, కల్లేపల్లి నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2025 | 01:03 AM