ఆపరేషన్ కగార్ నిలిపివేసేలా సుప్రీంకోర్టు ఆదేశించాలి
ABN , Publish Date - Jul 17 , 2025 | 11:45 PM
ఆపరేషన్ కగార్ నిలిపి వేసేలా సుప్రీంకోర్టు సుమోటోగా కేసు స్వీకరించి కేంద్రానికి ఆదేశాలి వ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబ శివ రావు కోరారు. ఎన్‌ఎస్ భవన్‌లో సీపీఐ 4వ మహాసభలను గురు వారం నిర్వహించారు.
పెద్దపల్లి టౌన్, జూలై 17 (ఆంధ్రజ్యోతి): ఆపరేషన్ కగార్ నిలిపి వేసేలా సుప్రీంకోర్టు సుమోటోగా కేసు స్వీకరించి కేంద్రానికి ఆదేశాలి వ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబ శివ రావు కోరారు. ఎన్‌ఎస్ భవన్‌లో సీపీఐ 4వ మహాసభలను గురు వారం నిర్వహించారు. జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి అమరుల స్తూపానికి నివాళులర్పించారు. సంతాప తీర్మానంతో పాటు జిల్లా రాజకీయ నివేదిక కార్యదర్శి తాండ్ర సదానందం ప్రవేశపెట్టారు. అనంతరం జరిగిన సమావేశంలో సాంబశివరావు, చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ వంద సంవత్సరాలు కలిగిన పార్టీ సీపీఐ అన్నారు. అను బంధ సంఘాలు, కార్యకర్తలు, నాయకులు పార్టీ పటిష్టతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక చట్టాలు సీపీఐ పోరాటాల ద్వారానే ఏర్పడ్డాయని, ఆ చట్టాలను కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మికులపై ఉందన్నారు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేసిం దని, ఈ ఉద్యమంలో అనేకమంది నాయకులు అమరులయ్యారన్నారు.
ఎర్రజెండా కింద ఉన్న అన్ని పార్టీలు ఏకమై ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. విద్య, కార్మికుల హక్కులు, మహిళల సంక్షే మానికి పోరాటాలు చేసిందన్నారు. మావోయిస్టులను అంతం చేయడం బీజేపీ తరం కాదని, కేంద్ర ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్, సంఘ్ పరివార్ అజెం డాను అమలు చేస్తోందని, దానిని ఎలాగైనా తిప్పి కొడతామని హెచ్చరిం చారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ పార్టీని జిల్లాలో బలోపేతం చేయాలని, దానికి జిల్లాలోని పార్టీ శ్రేణులు, అనుబంధ సంఘాల నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవెన శంకర్ మాట్లాడుతూ పోరాటాల ద్వారానే తమ హక్కులను సాధించుకోవచ్చన్నారు. జిల్లాలోని కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.