Share News

విద్యార్థులు లక్ష్యసాధనతో ముందుకు సాగాలి

ABN , Publish Date - Nov 06 , 2025 | 11:49 PM

ప్రతి విద్యార్థి లక్ష్యం ఏర్ప రుచుకొని ఏకాగ్రతతో చదివితే గమ్యం చేరుకోవడం సులభమవుతుందని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా తెలిపారు. గురువా రం జూనియర్‌ కళాశాలలో సైబర్‌ క్రైంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

విద్యార్థులు లక్ష్యసాధనతో ముందుకు సాగాలి

కమాన్‌పూర్‌, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): ప్రతి విద్యార్థి లక్ష్యం ఏర్ప రుచుకొని ఏకాగ్రతతో చదివితే గమ్యం చేరుకోవడం సులభమవుతుందని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా తెలిపారు. గురువా రం జూనియర్‌ కళాశాలలో సైబర్‌ క్రైంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ స్టార్మ్‌ ఫోన్‌ వల్ల సైబర్‌ మోసాలు సులువుగా జరుగుతున్నాయని, తల్లిదండ్రులకు సైబర్‌ మోసా లపై అవగాహన కల్పించాలన్నారు.

బ్యాంకుల పేరుతో లోన్‌లు, ఓటీపీలు, ఫ్రాడ్‌ కాల్స్‌పై వివరించారు. ఎవరైనా సైబర్‌ మోసాల బారిన పడితే వెంటనే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివానని, మీరు కూడా చదువుపై శ్రద్ధ పెట్టి, ఉన్నత స్థాయిలోకి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. గంజాయి, సిగరేట్లు, మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. డీసీపీలు కరుణాకర్‌, రమేష్‌, సైబర్‌ క్రైమ్‌ డీఎస్పీ రంగారెడ్డి, గోదావరిఖని టూ టౌన్‌ సీఐ ప్రసాద్‌ రావు, ఎస్‌ఐ కొట్టె ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2025 | 11:49 PM