Share News

విద్యార్థులు చట్టాలను తెలుసుకోవాలి

ABN , Publish Date - Dec 10 , 2025 | 11:33 PM

మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో బుధవారం బాలికల జూనియర్‌ కళాశాలలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కళా శాల ఇంచార్జి ప్రిన్సిపాల్‌ కోడూరి రమేష్‌ మాట్లాడారు. విద్యార్థులు, యువత మానవ హక్కులు, చట్టాలపై తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు.

విద్యార్థులు చట్టాలను తెలుసుకోవాలి

కోల్‌సిటీటౌన్‌, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో బుధవారం బాలికల జూనియర్‌ కళాశాలలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కళా శాల ఇంచార్జి ప్రిన్సిపాల్‌ కోడూరి రమేష్‌ మాట్లాడారు. విద్యార్థులు, యువత మానవ హక్కులు, చట్టాలపై తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. ప్రాథమిక హక్కులను పాఠశాల దశలోనే తెలియజేయాలని పేర్కొన్నారు. ఎదుటి వారి గౌరవానికి భంగం కల్గకుండా హక్కుల పరిరక్షణ అనేది ఉండాలన్నారు. ప్రస్తుత యువత వినియోగదారుల చట్టం, హక్కు వంటివి తెలుసుకోవాలని సూచిం చారు. 1948 డిసెంబరు 10న మానవ హక్కుల దినోత్సవంగా ప్రకటించారని, ఫాదర్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌గా ఫ్రెంచ్‌ జర్నలిస్టు రేనేకాసినో నిలిచారని, మానవ హక్కుల పరిరక్షణకు చేసిన కృషికి ఆయనకు 1968లో నోబుల్‌ బహుమతి వచ్చినట్టు రమేష్‌ తెలిపారు. ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారి శంకర్‌, అధ్యాపక బృందం అనురాధ, విజయ, రఘు, లక్ష్మి, ఓదేలు పాల్గొన్నారు.

పాలకుర్తి,అంతర్గాం, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఇండియా జిల్లా అధ్యక్షుడు కొండల రాజేందర్‌ కుమార్‌ అన్నారు. రామగుండంలో ఏర్పాటు చేసిన జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఇండియా వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు చెన్నుపాటి శ్రీకాంత్‌ ఆదేశాల మేరకు జాతీయ అదనపు ప్రధాన కార్యదర్శి మాదాసి చారేంద్ర సూచనల మేరకు మానవ హక్కుల గురించి చర్చించారు. బోంకూరి కైలాసం, చంద్రకాంత్‌, జాగటి శాంతమ్మ, లక్ష్మి, అబ్దుల్‌ సలీం, సిరికొండ కోటి, పాల్గొన్నారు.

Updated Date - Dec 10 , 2025 | 11:33 PM