Share News

విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి

ABN , Publish Date - Sep 10 , 2025 | 12:01 AM

విద్యార్థులు చదువుతోపాటు సాంస్కృ తిక రంగాల్లో రాణించాలని జిల్లా విద్యాధికారి మాధవి అన్నారు. జిల్లా కేంద్రంలోని సెయింట్‌ ఆన్స్‌ పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి కళోత్సవాల ముగింపులో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి

పెద్దపల్లి కల్చరల్‌, సెప్టెంబరు 9(ఆంధ్ర జ్యోతి): విద్యార్థులు చదువుతోపాటు సాంస్కృ తిక రంగాల్లో రాణించాలని జిల్లా విద్యాధికారి మాధవి అన్నారు. జిల్లా కేంద్రంలోని సెయింట్‌ ఆన్స్‌ పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి కళోత్సవాల ముగింపులో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పాఠశాలలో నిర్వహించిన 11 అంశాల్లో పోటీలు జరిగాయి. పలువురు విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు డీఈఓ తెలిపారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన వారి వివరాలు సోలో ఓకల్‌ మ్యూజిక్‌లో రామగుండం నుంచి నక్షత్ర, గ్రూపు విభాగంలో అంతర్గాం నుంచి శ్రీవల్లి, ఇన్ర్సుమెంటల్‌ సోలో రామగుండం సెయింట్‌ జోసెఫ్‌ పాఠ శాల నుంచి జస్టిన్‌, గ్రూప్‌లో అంతర్గాం కేజీబీవీ హర్షిణి, డాన్స్‌ క్లాసిక్‌ సోలో ఎన్‌టీపీసీ భారతి పాఠశాల నుంచి నక్షత్ర, గ్రూపులో మంథని ట్రైబల్‌ వెల్ఫేర్‌ మానస, థియేటర్‌ గ్రూప్‌ నుంచి గట్టెపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల మన్హా, విజువల్‌ ఆర్ట్స్‌ సోలో పెద్దపల్లి సెయింట్‌ ఆన్స్‌ పాఠశాల నుంచి ఆర్షియా, విజువల్‌ ఆర్ట్స్‌ 3డి గ్రూపు విభాగంలో అంతర్గాం కేజీబీవీ మిల్కీ, ట్రెడిషనల్‌ స్టోరీలో రామగుండం సోషల్‌ వెల్ఫేర్‌ విద్యార్థి తన్మయశ్రీ గ్రూపు విభాగంలో ఎంపికైనట్లు ప్రకటించారు. జిల్లా అకడమిక్‌ మానిటరింగ్‌ ఆర్గనైజర్‌ షేక్‌, ఎంఈఓ సురేంద్ర కుమార్‌, కళా ఉత్సవాల ఆర్గనైజర్‌ గడ్డం జగదీశ్వర్‌లతోపాటు ప్రధానోపాధ్యాయులు ఆగయ్య, పురుషోత్తం, ఆర్గనైజర్లు రాంకిషన్‌, వెంకటేశ్వర్లు, గాయత్రి మల్లారెడ్డి, అశోక రాజు, కృష్ణమోహన్‌, నరేష్‌, శ్యామల, అనుపమ, రజిత, నాగరాజు, జ్యోతి, కిరణ్‌, రవి, ప్రభాకర్‌ రెడ్డి, దేవెందర్‌ రెడ్డి, సంపత్‌ రెడ్డి, సీఆర్‌పీలు పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2025 | 12:01 AM