విద్యార్థులు న్యాయవిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి
ABN , Publish Date - Jul 05 , 2025 | 11:30 PM
విద్యార్థులు న్యాయ విజ్ఞానాన్ని పెంపొందిం చుకోవాలని జిల్లా అడిషనల్ డిస్ర్టిక్ట్ సెషన్స్ జడ్జి డాక్టర్ టి.శ్రీనివాసరావు అన్నారు. మం డల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వ హించారు.
కోల్‌సిటీటౌన్, జూలై 5(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు న్యాయ విజ్ఞానాన్ని పెంపొందిం చుకోవాలని జిల్లా అడిషనల్ డిస్ర్టిక్ట్ సెషన్స్ జడ్జి డాక్టర్ టి.శ్రీనివాసరావు అన్నారు. మం డల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వ హించారు. జడ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ర్యాగింగ్, వరకట్నం, అవినీతి అంటరాని తనం లాంటి విషయాల పట్ల విద్యార్థులు అవగాహనతో ఉండాలన్నారు.
సమస్యలను న్యాయపరంగా ఏవిధంగా ఎదుర్కొవాలో తెలుసుకోవాలన్నారు. విద్యార్థులు విద్యలో రాణించి సమాజం పట్ల బాధ్యతగా వ్యవహ రించాలన్నారు. ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి, కళాశాల ప్రిన్సిపల్ డి.కల్పన అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గోదావరి ఖని బార్ అసోసియేషన్ అధ్యక్షులు టి.సతీ ష్, ఎమినెంట్ పర్సన్ ఎన్.కిషన్‌రావు, ఏజీపీ శంతన్‌కుమార్, కోర్ట్ సిబ్బంది, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.