విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలి
ABN , Publish Date - Jul 25 , 2025 | 11:27 PM
విద్యా ర్థులకు మెరుగైన బోధన అందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. శుక్ర వారం ఉపాధ్యాయులతో కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందిం చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉపాధ్యాయుల నుంచి సలహాలు, సూచనలు తెలుసుకున్నారు.
పెద్దపల్లి కల్చరల్, జూలై 25 (ఆంధ్రజ్యోతి): విద్యా ర్థులకు మెరుగైన బోధన అందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. శుక్ర వారం ఉపాధ్యాయులతో కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందిం చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉపాధ్యాయుల నుంచి సలహాలు, సూచనలు తెలుసుకున్నారు. ఉపాధ్యాయులకు ఉన్న సమస్యలను జిల్లా పరిధిలో పరిష్కరిస్తానని, మిగిలిన సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తానని కలెక్టర్ తెలిపారు. కొందరు విద్యార్థులకు ఆధార్ కార్డు లేదని, వారి కోసం ప్రతీ మండలంలో క్యాంపెయిన్ ఏర్పాటు చేస్తామని ఉపాధ్యాయులకు తెలిపారు. సీ గ్రేడ్ విద్యార్థుల కోసం ప్రత్యేక వర్క్ బుక్, స్పెషల్ టీచింగ్ ప్లాన్ చేయాలని, హైస్కూల్‌లో ఇంగ్లీష్ చదవడం రాని పిల్లలకు ప్రత్యేక తరగతులు తీసుకో వాలన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చేరేలా చూడాలన్నారు. ప్రాథమికోన్నత పాఠశాలలో కూడా ఐఎఫ్‌పి ప్యానల్స్ ఏర్పాటు చేయా లని ఉపాధ్యాయులు సలహా ఇచ్చారు. ఉపాధ్యాయులకు ఎఫ్‌ఆర్‌ఎస్ మినహాయించి మిగిలిన నాన్ అకాడమిక్ పనులు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. విద్యార్థి ప్రమాణాలు పెంచేందుకు ఏఐ టూల్స్ వినియోగంపై ఉపాధ్యాయులు అవగాహన పెంచుకోవాలన్నారు. పాఠశాల వివరాలను యూఐడీసీ పోర్టల్‌లో నమోదు చేయాలని తెలిపారు. ప్రభుత్వం చేసిన సర్వే ప్రకారం 9వ తరగతి పిల్లలు గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టుల్లో చాలా వెనుకబడి ఉన్నారని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి మాదవి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.