విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలి
ABN , Publish Date - May 17 , 2025 | 12:07 AM
ప్రభుత్వ పాఠశాలల విద్యా ర్థులకు మెరుగైన బోధన అందించేందుకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం జడ్పీహెచ్‌ఎస్ బాలుర, బాలికల పాఠశాలల్లో ఉపాధ్యాయులకు నిర్వహించిన వేసవి శిక్షణలో కలెక్టర్ పాల్గొన్నారు.
పెద్దపల్లి కల్చరల్, మే 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల విద్యా ర్థులకు మెరుగైన బోధన అందించేందుకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం జడ్పీహెచ్‌ఎస్ బాలుర, బాలికల పాఠశాలల్లో ఉపాధ్యాయులకు నిర్వహించిన వేసవి శిక్షణలో కలెక్టర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ విద్యాశాఖలో ఒకే రోజు మార్పు సాధ్యం కాదని, నిర్వీరామంగా ప్రయత్నం జరగాలన్నారు. నిరుపేద రైతులు, కూలీలు, బడుగు బలహీన వర్గాల కుటుంబాల నుంచి వచ్చిన పిల్లల జీవితాలను బాగుచేసే అవకాశం ఉపాధ్యాయులకు లభిం చిందన్నారు. యువతకు మంచి విద్య, నైపుణ్యం అందించగలిగితే దేశం సూపర్‌పవర్‌గా ఎదుగుతుందన్నారు. సమాజంలో మంచి పునాది ఉండా లంటే ఉపాధ్యాయులు కీలకమన్నారు. ఉపాధ్యాయులకు ఈనెల 13నుంచి 31 వరకు పలు అంశాలపై శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యా యులు వేసవి శిక్షణలో నేర్చుకున్న అంశాలను బోధనలో అమలు చేయాలని కలెక్టర్ కోరారు. డీఈవో డి.మాధవి పాల్గొన్నారు.