సైన్స్‌అండ్ టెక్నాలజీలో విద్యార్థులు ముందుండాలి
ABN , Publish Date - Dec 03 , 2025 | 12:19 AM
విద్యార్థులు సైన్స్, టెక్నాలజీపై ఆసక్తి చూపాలని, ఆధునిక కాలంలో సైన్స్‌పై అవగాహన పెంచుకొని పరిశోధ నల వైపు దృష్టి సారించాలని జిల్లా పరిషత్ సీఈఓ నరేందర్ పేర్కొన్నారు. మంగళవారం ఎన్టీపీసీ టీటీసీలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్‌ఫెయిర్ ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారం భించారు.
జ్యోతినగర్, డిసెంబరు 2 (ఆంధ్ర జ్యోతి): విద్యార్థులు సైన్స్, టెక్నాలజీపై ఆసక్తి చూపాలని, ఆధునిక కాలంలో సైన్స్‌పై అవగాహన పెంచుకొని పరిశోధ నల వైపు దృష్టి సారించాలని జిల్లా పరిషత్ సీఈఓ నరేందర్ పేర్కొన్నారు. మంగళవారం ఎన్టీపీసీ టీటీసీలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్‌ఫెయిర్ ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారం భించారు. ఆయన మాట్లాడుతూ విద్యా ర్థులు సృజనాత్మకత, సైన్స్‌లో నూతన ఆవిష్కరణలు చేయాలన్నారు. సైన్స్‌ను తమ కెరీర్‌కు ఉపయోగకరంగా ఉండేలా చైతన్యవంతులు కావాలన్నారు. వైజ్ఞానిక ప్రదర్శనల ద్వారా విద్యార్థుల్లో దాగిన సృజ నాత్మకతను వెలికి తీస్తుందన్నారు. డీఈఓ శారద మాట్లాడుతూ విద్యార్థులు ఎంచు కున్న లక్ష్యాలను సాధించా లన్నారు. సైన్స్ రంగంలో ముందుండాలని, టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని తెలిపారు. మూడు రోజులపాటు కొనసాగే బాల వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్‌స్పైర్ అవార్డుల ఎంపిక కార్యక్రమంలో జిల్లాలోని వివిధ పాఠశా లలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. బుధవారం ఆయా కమిటీల ఉపాధ్యా యులు, విద్యార్థులు రూపొందించిన నమునాలను పరిశీలించి ఉత్తమ వాటిని ఎంపిక చేస్తారు. జిల్లా అకాడమిక్ అధి కారి షేక్, సైన్స్ అధికారి హనుమంతు, సెక్టోరియల్ అధికారి కవిత, మల్లేష్, అజీ మ్, ఎంఈవో మల్లేశం, సురేం ద్రకుమార్, హరిప్రసాద్, విమల, రాజ య్య, రాంరెడ్డి, స్వర్ణలత, ఆగయ్య, కొము రయ్య, లక్ష్మి, విజయకుమార్ పాల్గొన్నారు.