పోలీసుల విధులపై విద్యార్థులకు అవగాహన
ABN , Publish Date - Oct 27 , 2025 | 11:44 PM
విద్యార్థు లకు పోలీసు శాఖ విధులపై అవగాహన కలిగి ఉండాలని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. సోమవారం కమిషనరేట్ కార్యాల యంలో పోలీస్ విధులపై ఓపెన్‌హౌస్ నిర్వహిం చారు.
కోల్‌సిటీ, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): విద్యార్థు లకు పోలీసు శాఖ విధులపై అవగాహన కలిగి ఉండాలని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. సోమవారం కమిషనరేట్ కార్యాల యంలో పోలీస్ విధులపై ఓపెన్‌హౌస్ నిర్వహిం చారు. ఆయన మాట్లాడుతూ పోలీసులు కేవలం నేరస్థులను పట్టుకోవడమే కాకుండా సమాజంలో శాంతి భద్రతలు, చట్టపరమైన అవగాహన పెం పునకు నిరంతరం కృషి చేస్తారన్నారు. ప్రజల రక్షణ, మహిళ భద్రత, నేరాల నియంత్రణకు పని చేస్తుందని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వల్ల రోడ్డు ప్రమాదాలు అరికట్టవచ్చునని చెప్పారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచిం చారు. యువత గంజాయి, డ్రగ్స్, మత్తు పదా ర్థాలకు దూరంగా ఉండాలన్నారు. యాప్‌ల ద్వారా రుణాలు తీసుకుంటూ చెల్లించకపోవడం వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, యాప్‌లపై అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. మహి ళలపై జరుగుతున్న నేరాలను అరికట్టడానికి, వారి రక్షణ గురించి షీటీం పనిచేస్తుందన్నారు. వెయ్యి మంది విద్యార్థిని విద్యార్థులకు ఓపెన్ హౌస్‌లో పాల్గొన్నారు. పోలీస్‌విధులు, కమ్యూనికేషన్ సిస్టం, ఫింగర్ ప్రింట్‌డివైజ్‌ల వల్ల ఉపయోగాల గురించి, బీడీ టీమ్ ఎక్విప్‌మెంట్, డాగ్ స్క్వాడ్, రోడ్డు ప్రమాదాల స్పీడ్‌లేజర్‌గన్, తదితర స్టాల్స్‌ను ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు.
ఆకట్టుకున్న స్నిఫర్ డాగ్ ప్రదర్శన
పోలీస్ అధికారులు నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై స్నిఫర్ డాగ్ ప్రదర్శన విద్యార్థులను ఆకట్టుకున్నది. డాగ్స్ చేసిన ప్రదర్శనను ఆసక్తిగా వీక్షించారు. బాంబ్ స్క్వాడ్ ప్రదర్శన, నేరస్థులను పట్టుకోవడంలో డాగ్స్ చేస్తున్న కృషిని తిలకించారు. అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, వన్‌టౌన్ సీఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రవీణ్ కుమార్, కమ్యూనికేషన్ ఇన్‌స్పెక్టర్ రాంప్రసాద్, ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్, ఫింగర్ ప్రింట్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఆర్‌ఐలు, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు పోచలింగం పాల్గొన్నారు.