Share News

గుర్తింపు సంఘంతో స్ట్రక్చర్‌ సమావేశం

ABN , Publish Date - Oct 18 , 2025 | 11:58 PM

గుర్తింపు సంఘం ఏఐటీయూసీతో శనివారం ఆర్జీ-2 జీఎం బండి వెంకటయ్య స్ట్రక్చర్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఏరియాలో పలు సమస్యలను ఏఐటీయూసీ నాయకులు జీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఓసీపీ-3లోని సర్ఫేస్‌ జనరల్‌ అసిస్టెంట్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌ ఖాళీలను వీకేపీ గని నుంచి సీనియార్టీ ప్రాతిపదికన భర్తీ చేయాలని నాయకులు డిమాండ్‌ చేశారు.

గుర్తింపు సంఘంతో స్ట్రక్చర్‌ సమావేశం

యైుటింక్లయిన్‌కాలనీ, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): గుర్తింపు సంఘం ఏఐటీయూసీతో శనివారం ఆర్జీ-2 జీఎం బండి వెంకటయ్య స్ట్రక్చర్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఏరియాలో పలు సమస్యలను ఏఐటీయూసీ నాయకులు జీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఓసీపీ-3లోని సర్ఫేస్‌ జనరల్‌ అసిస్టెంట్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌ ఖాళీలను వీకేపీ గని నుంచి సీనియార్టీ ప్రాతిపదికన భర్తీ చేయాలని నాయకులు డిమాండ్‌ చేశారు. డీజిల్‌ బోజర్‌ రిపేర్‌ నిమిత్తం ఆటోమోడల్‌ వర్క్‌షాప్‌ని ఏర్పాటు చేయాలని, పెండిం గ్‌లో ఉన్న కొత్తగూడెం నుంచి ఆర్జీ-2కు బదిలీపై వచ్చిన ఉద్యోగుల సీఎం పీఎఫ్‌ జమ చేయాలని, డంపర్‌ గ్రేడర్‌లకు సరిపడా స్పేర్‌ పార్ట్స్‌ అందు బాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాలనీలోని అన్ని క్వార్టర్ల డ్రైనేజీ లైన్లను ఆధునీకరించాలని, పోతనకాలనీ క్వార్టర్‌ల పైకప్పులు మరమ్మతు చేయాలని, శ్మశాన వాటికలో లైటింగ్‌, నీటి వసతి, స్నానపు గదులు ఏర్పాటు చేయాలని జీఎంను కోరారు. ఎస్వోటూ జీఎం రాముడు, డీజీఎం పర్సనల్‌ డీజీఎం అరవిందరావు, స్ట్రక్చర్‌ కమిటీ సభ్యులు జీ రవీందర్‌, రాజారత్నం, శ్యాంసన్‌, సాంబ శివరావు, రవికుమార్‌, మహేం దర్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 18 , 2025 | 11:58 PM