ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు
ABN , Publish Date - Feb 26 , 2025 | 12:29 AM
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దప ల్లి, మంచిర్యాల జిల్లాల్లో ఎమ్మె ల్సీ ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పేర్కొన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీకి సం బంధించి 36 లొకేషన్‌లలో 108 పోలింగ్‌స్టేషన్లు ఉన్నాయన్నారు.

కోల్‌సిటీ, ఫిబ్రవరరి 25 (ఆం ధ్రజ్యోతి): రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దప ల్లి, మంచిర్యాల జిల్లాల్లో ఎమ్మె ల్సీ ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పేర్కొన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీకి సం బంధించి 36 లొకేషన్‌లలో 108 పోలింగ్‌స్టేషన్లు ఉన్నాయన్నారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 15 లొకేషన్‌లలో 50 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, మంచిర్యాల జిల్లాలో 21 లొకేషన్‌లలో 58పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. అన్నీ పోలింగ్ స్టేషన్లకు నంబర్ మార్క్, వెబ్ కాస్టింగ్ జియో ట్యాగింగ్ పూర్తి చేశామన్నారు. 19 రూట్ మొబైల్స్, 17స్ర్టైకింగ్ ఫోర్స్, 5 స్పెషల్ స్ర్టైకింగ్ ఫోర్స్, 7ఎఫ్‌ఎస్‌టీ, వీఎస్‌టీ టీములు ఏర్పాటు చేసినట్టు సీపీ తెలిపారు. ఐదుగురు ఏసీపీలు, 21మంది సీఐలు, 37మంది ఎస్‌ఐలు, 117మంది ఏఎస్‌ఐలు, హెడ్‌కాని స్టేబుళ్లు, 198మంది కానిస్టేబుళ్లు, 17 ఆర్మ్‌డ్ సెక్షన్లు, 78 మంది హోంగార్డులు 500మంది సిబ్బంది బందోబస్తులో ఉంటారన్నారు. సర్కిళ్ల పరిధిలో సీఐలు, డివిజన్ల పరిధిలో ఏసీపీలు బందోబస్తును పర్యవేక్షిస్తారన్నారు.
బీఎన్‌ఎస్‌ఎస్ 163సెక్షన్ అమలు
ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా పోలింగ్ కేంద్రాల వద్ద బీఎన్‌ఎస్‌ఎస్ 163సెక్షన్ అమలు చేస్తున్నట్టు సీపీ శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 25వ తేది సాయంత్రం 4గంటల నుంచి 28వ తేది ఉదయం 8గంటల వరకు కమిషనరేట్ పరిధిలోని పోలింగ్ కేంద్రాల వద్ద సెక్షన్ అమలు చేస్తున్నామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్ల చుట్టూ ఈ సెక్షన్ అమ లులో ఉంటుందని, ఐదుగురు, అంతకన్నా ఎక్కువ మంది గుం పుగా తిరగవద్దన్నారు. పార్టీ జెండాలు, గుర్తులు, ప్లకార్డులు ప్రదర్శించవద్దన్నారు. మైకులు, లౌడ్ స్పీకర్లు వాడవద్దని, పాటలు, ఉపన్యాసాలు ఇవ్వవద్దన్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, ఊరేగింపులు, బాణాసంచా కాల్చడం వంటివి నేరంగా పరిగణిస్తామన్నారు.