Share News

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి పటిష్ట చర్యలు

ABN , Publish Date - Nov 18 , 2025 | 11:32 PM

కేజీబీవీలో చదివే విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం ఎల్లంపల్లిలోని కేజీబీవీ పాఠశాల, అంతర్గాంలోని ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యా ర్థుల బోధన శైలి, పిల్లలకు అందిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు.

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి పటిష్ట చర్యలు

అంతర్గాం, నవంబరు18(ఆంధ్రజ్యోతి): కేజీబీవీలో చదివే విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం ఎల్లంపల్లిలోని కేజీబీవీ పాఠశాల, అంతర్గాంలోని ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యా ర్థుల బోధన శైలి, పిల్లలకు అందిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. వారితో కలిసి భోజనం చేశారు. పిల్లలకు ఏ మేరకు పాఠాలు అర్థమవుతున్నాయో అడిగి తెలుసుకు న్నారు. స్టడీ అవర్స్‌ నిర్వహించాలని, ఖాన్‌ అకాడమి, ఫిజిక్స్‌ వాలా కోర్సులు విద్యార్థులకు ఉపయోగపడేలా చూడాల న్నారు. చలి తీవ్రత పెరిగిందని, వాటర్‌ హీటర్స్‌ అందు బాటులో పెట్టుకోవాలన్నారు. ఏమైనా అవసరం ఉంటే వెం టనే ప్రతిపాదనలు అందించాలని ఆయన తెలిపారు. అనం తరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఔట్‌ పేషెంట్‌ వివరాలు, ఆసుపత్రిలో రోగులకు అం దుతున్న పలు వైద్య సేవలు, అందుబాటులో ఉన్న మందుల స్టాక్‌ వివరాలను తెలుసుకున్నారు. పేదల కు మెరుగైన వైద్యసేవలు అందించినప్పుడే గుర్తింపు ఉంటుందన్నారు. ఎస్‌ఓ కల్పన, ఉపాధ్యాయులు, వైద్యఅధికారి ఉదయ్‌ కిరణ్‌ ఉన్నారు.

సమ్మక్క-సారలమ్మ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు

కోల్‌సిటీ/అంతర్గాం, (ఆంధ్రజ్యోతి): గోదావరిఖని గోదావరి తీరంలో నిర్వహించనున్న సమ్మక్క-సారలమ్మ జాత రకు ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. మంగళవారం గోదావరిఖని, గోలివాడ సమ్మక్క-సారలమ్మ జాతర ప్రాంగణా లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ గోదావరిఖని రూ.5కోట్లతో జరుగు తున్న అభివృద్ధి పనులపై వాకబు చేశారు. జనవరిలో జరిగే ఈ జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరై అమ్మ వార్లను దర్శించుకుంటారని, జాతర నిర్వహణకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసి సన్నద్ధంగా ఉండాలన్నారు. సింగరేణి సంస్థ త్వరగా పనులు పూర్తి చేయాలని, మున్సిపల్‌ కార్పొరేషన్‌ అభివృద్ధి పనులకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. డిసెంబర్‌ నాటికి పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. జాతర నిర్వహణ సమయంలో పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యతని వ్వాలని ఆదేశించారు. రోజు చెత్తను శుభ్రం చేయడం, విద్యుత్‌ దీపాలంకరణ, జనరేటర్లు ఏర్పాటు చేయాలన్నారు. జాతర నిర్వ హణకు సంబంఽధించి పోలీస్‌, సింగరేణి, నీటి పారుదలశాఖ, రెవెన్యూ, దేవాదయశాఖ, మున్సిపల్‌ కార్పొరేషన్లు సం యుక్తంగా సమన్వయంతో పని చేయాలన్నారు. అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ, ఆర్‌జీ-1 జీఎం లలిత్‌ కుమార్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఈఈ రామన్‌, ఎండోమెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ సుప్రియ, డీపీవో వీరబుచ్చయ్య, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 18 , 2025 | 11:32 PM