రైతుల ఆర్థిక బలోపేతానికి పటిష్ట చర్యలు
ABN , Publish Date - Aug 12 , 2025 | 12:15 AM
రైతు లను బలోపేతం చేసే దిశగా సంక్షేమ కార్యక్రమాల అమలుతోపాటు అనుబంధ రంగాల అభివృద్ధికి పటిష్ట చర్యలు చేపట్టామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మం త్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు కోరారు. సోమవారం కలెక్టర్ కోయ శ్రీహర్ష, కరీంనగర్ డీసీసీబీ చైర్మన్ రవీందర్ రావుతో కలిసి మంత్రి శ్రీధర్‌బాబు చిల్లపల్లిలో రాష్ట్ర వేర్ హౌజింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూ.7 కోట్లతో 5 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్న రెండు గోదాం లకు, గుంజపడుగులో రూ.2.90 కోట్లతో పీఎం కుసుమ్ ప్యాక్స్ ఏర్పాటు చేసే సోలార్ పవర్ ప్లాంట్‌కు శంకు స్థాపన చేశారు.
మంథనిరూరల్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): రైతు లను బలోపేతం చేసే దిశగా సంక్షేమ కార్యక్రమాల అమలుతోపాటు అనుబంధ రంగాల అభివృద్ధికి పటిష్ట చర్యలు చేపట్టామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మం త్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు కోరారు. సోమవారం కలెక్టర్ కోయ శ్రీహర్ష, కరీంనగర్ డీసీసీబీ చైర్మన్ రవీందర్ రావుతో కలిసి మంత్రి శ్రీధర్‌బాబు చిల్లపల్లిలో రాష్ట్ర వేర్ హౌజింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూ.7 కోట్లతో 5 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్న రెండు గోదాం లకు, గుంజపడుగులో రూ.2.90 కోట్లతో పీఎం కుసుమ్ ప్యాక్స్ ఏర్పాటు చేసే సోలార్ పవర్ ప్లాంట్‌కు శంకు స్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా జిల్లాలో నందిమేడారం, కాల్వశ్రీరాంపూర్, అప్పన్నపేట, మంథని ప్రాంతంలో 1 మెగావాట్ చొప్పున ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 4 నెలల కాలంలో విద్యుత్ ప్లాంట్ నిర్మాణ పనులు, గ్రిడ్ పనులు పూర్తి చేయాలన్నారు. చిల్లపల్లిలో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాంలను రూ.7 కోట్లతో చేపట్టామన్నారు. గుంజపడు గులో సహకార బ్యాంక్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. రైతు సంక్షేమ కార్యక్రమాల తోపాటు అనుబంధ రం గాలైన గోదాంల నిర్మాణం, పీఏసీఎస్ ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటుతో రైతులను బలో పేతం చేస్తామన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఏఎంసీ కుడుదుల వెంకన్న, ఆర్డీవో సురేష్, అధికారులు పాల్గొన్నారు.
సహకార బ్యాంక్ ప్రారంభం
కమాన్‌పూర్, (ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమానికి సహకార బ్యాంకులు ఉపయోగపడాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. సోమవారం రూ.65 లక్షలతో నిర్మించిన ప్రాథమిక సహకార సంఘం భవనంతోపాటు రూ.79 లక్షలతో నిర్మించిన జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ బ్రాంచ్ భవనాన్ని కరీంనగర్ డీసీసీబీ చైర్మన్ రవీందర్‌రావు, కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ప్రారంభించారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో రైతుల సంక్షే మానికి చర్యలు చేపట్టామన్నారు. జిల్లా సహకార కేంద్రం బ్యాంక్‌లో డిపాజిటర్లకు, కస్టమర్లకు అన్ని రకాల సౌకర్యాలు ఉండేలా నిర్మించినట్లు తెలి పారు. పేద ప్రజలకు ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలను వారికి చేర్చేందుకు బ్యాంకులు ఉపయో గపడుతాయని తెలిపారు. రైతులకు అందుబాటులో ఉండేలా మండల కేంద్రంలో సహకార బ్యాంక్ బ్రాంచ్ ఏర్పాటు చేశామని తెలిపారు. కరీంనగర్ డీసీసీబీ చైర్మన్ రవీందర్‌రావు మాట్లాడుతూ మండలంలో ప్రాథ మిక వ్యవసాయ సహ కార సంఘం, సహకార బ్యాంక్ భవనాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. కేంద్ర సహకార బ్యాంకు ల్లో 72 శాఖలు ఉంటే 32 భవనాలు నిర్మించుకున్నామన్నారు. సహకార సొసైటీ ద్వారా కూడా భవనాలు బ్యాంకుకు అద్దె ఇస్తున్నామ న్నారు. గతంలో 70 కోట్ల నష్టం, రూ.400 కోట్ల వ్యాపా రంతో ఉన్న సహకార బ్యాంకును నేడు 7200 కోట్ల వ్యాపారం, రూ.120 కోట్ల లాభాలతో నడిచేలా అభివృద్ధి చేశామన్నారు. యేటా కస్టమర్లకు, వాటాదారులకు బోనస్ అందిస్తున్నామని అన్నారు. ఆర్డీవో సురేష్, తహసీల్దార్, ఎంపీడీఓ నాయ కులు పాల్గొన్నారు.