Share News

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

ABN , Publish Date - Jul 29 , 2025 | 11:39 PM

విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్య లు తీసుకుంటామని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష హెచ్చరిం చారు. స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను, మాతా శిశు ఆసుపత్రిని, మండలంలోని గద్దలపల్లి పీహెచ్‌సీని, గోపాల్‌పూర్‌ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను కలెక్టర్‌ కోయ శ్రీహర్ష మంగళవారం తని ఖీ చేశారు.

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

మంథని/మంథనిరూరల్‌, జూలై 29 (ఆంధ్ర జ్యోతి): విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్య లు తీసుకుంటామని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష హెచ్చరిం చారు. స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను, మాతా శిశు ఆసుపత్రిని, మండలంలోని గద్దలపల్లి పీహెచ్‌సీని, గోపాల్‌పూర్‌ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను కలెక్టర్‌ కోయ శ్రీహర్ష మంగళవారం తని ఖీ చేశారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం 11.30 గంటల వరకు ఆర్‌ఎంవో డాక్టర్‌ టీవీ. రాజశేఖ ర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ బీ. రాజశేఖర్‌, ఎంఎన్‌వో శంశీర్‌ఖాన్‌, ఎస్‌సీడీ కాంట్రాక్ట్‌ ఉద్యోగి సాహితీ ప్రియలు విధులకు హాజరుకాకపోవడంపై కలెక్టర్‌ అసహనం వ్యక్తం చేశారు. ముందస్తు అనుమతి లేకుండా విధులకు నలుగురు ఉద్యోగులు గైర్హాజరు కావడం లేదా సమయపాలన పాటించకుండా ఆసుప త్రికి లేటుగా రావడం, బయోమెట్రిక్‌ విధానంలో హాజరు నమోదు చేయకపోవడంపై 3 రోజుల్లో వివ రణ ఇవ్వాలని కలెక్టర్‌ వారికి మెమో ఇచ్చారు.

ఆయ న మాట్లాడుతూ డాక్టర్లు, సిబ్బంది సమయపా లన పాటించాలన్నారు. ఆసుపత్రిలో బయోమె ట్రిక్‌ విధానం ద్వారా హాజరు నమోదు చేసు కోవాలన్నారు. మాతా శిశు ఆరగ్యో కేంద్రంలో మెరు గైన వైద్య సేవలను అందించాలన్నారు. గోపా ల్‌పూర్‌ ప్రాథమిక పాఠశాల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలనారు. గద్దల పల్లి పీహెచ్‌సీలో ఏఎంసీ ప్రొఫైల్‌ సక్రమంగా నిర్వహించాలని, ఎన్‌సీడీసీ స్ర్కీనింగ్‌, ఎక్స్‌రే, టీబీ, ముక్త్‌ భారత్‌, ఆరోగ్య మహిళ కార్యక్ర మాలు, ఓపీ సేవలు పెంచాలన్నారు. ఎంపీడీవో శశికళ, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రాజశేఖర్‌, పీఆర్‌ ఏఈ అనుదీప్‌లు పాల్గొన్నారు.

Updated Date - Jul 29 , 2025 | 11:39 PM