Share News

ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు

ABN , Publish Date - Nov 15 , 2025 | 12:17 AM

ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా చెప్పారు. శుక్రవారం సింగరేణి ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడి కల్‌ సైన్స్‌లో వన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇంద్రసేనారెడ్డి, షీ టీమ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన యాంటీ ర్యాగింగ్‌ అవగాహన కార్యక్రమానికి సీపీ హాజరై మాట్లాడారు.

ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు

కళ్యాణ్‌నగర్‌, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా చెప్పారు. శుక్రవారం సింగరేణి ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడి కల్‌ సైన్స్‌లో వన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇంద్రసేనారెడ్డి, షీ టీమ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన యాంటీ ర్యాగింగ్‌ అవగాహన కార్యక్రమానికి సీపీ హాజరై మాట్లాడారు. సీనియర్‌, జూనియర్‌ విద్యార్థులు ఒకరిపై ఒకరు గౌరవం పెరగాలని, ర్యాగింగ్‌కు పాల్పడితే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని, కళాశాల నుంచి సస్పె న్షన్‌, తొలగింపు వరకు చర్యలు ఉంటాయన్నారు. తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న ఆశలు, మీరు ఎంచుకున్న లక్ష్యాలు అర్థాంతరంగా ముగిసి పోయి భవిష్యత్‌ దెబ్బతింటుదన్నారు. ఎవరైనా ర్యాగింగ్‌కు గురైతే మానసికంగా కృంగిపోయి బాధపడకుండా ధైర్యంగా కళాశాలకు రావాలని, పోలీసులకు, యాంటీ ర్యాగింగ్‌ కమిటీకి సమా చారం ఇవ్వాలని సూచించారు. వైద్య వృత్తి ఎంతో ముఖ్యమైనదని, వైద్యులు దైవంతో సమా నమన్నారు. విద్యార్థులు గంజాయి, డ్రగ్స్‌ వంటి మత్తు పదార్థాలకు బానిసై బంగారు భవి ష్యత్‌ను నాశనం చేసుకోవద్దన్నారు.

క్యాంపస్‌ చుట్టూ సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయ డంతోపాటు నిరంతరం పోలీస్‌ పెట్రోలింగ్‌ కొనసాగుతుందని, పూర్తిగా ర్యాగింగ్‌ను నిర్మూ లించేందుకు కళాశాల సిబ్బంది, పోలీస్‌శాఖ సమన్వయంతో కఠిన చర్యలు తీసుకొంటామ న్నారు. సైబర్‌ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో అనుమానాస్పద వెబ్‌సైట్లు, లింకులు, తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌లు క్లిక్‌ చేయ వద్దని సూచించారు. ఏసీపీ మడత రమేష్‌ మాట్లాడుతూ సీని యర్‌ విద్యార్థులు జూనియర్లకు సహా యం చేయాలని, మార్గనిర్దేశనం ఇవ్వా లని, ర్యాగింగ్‌ పేరుతో బాధ పెట్టవద్దన్నారు. క్రమశిక్షణతో సత్సంబంధాలు, పరస్పర గౌరవం, ఎలాంటి భయాలు లేకుండా సురక్షితమైన వాతావరణంలో కలిసి ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం యాంటీ ర్యాగింగ్‌ పోస్టర్లను సీపీ విడుదల చేశారు. మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ నరేందర్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీ నాగేందర్‌, ఎస్‌ఐలు సునీత, అనూష, లావణ్యతో పాటు ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2025 | 12:17 AM