లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు
ABN , Publish Date - Oct 23 , 2025 | 11:45 PM
లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా, ప్రోత్సహించినా, చేయమని అడిగినా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి వాణిశ్రీ హెచ్చరించారు. గురువారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని రేడియాలజీ, గైనిక్ విభాగంలో స్కానింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు.
కళ్యాణ్‌నగర్, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా, ప్రోత్సహించినా, చేయమని అడిగినా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి వాణిశ్రీ హెచ్చరించారు. గురువారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని రేడియాలజీ, గైనిక్ విభాగంలో స్కానింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. రేడియాలజీ విభాగంలో స్కానింగ్ రికార్డులు, ఫామ్-ఎఫ్ రిపోర్టులు, స్కానింగ్ మిషన్ మేక్ మోడల్, క్రమసంఖ్య తదితర వివరాలను తెలుసుకున్నారు.
గర్భంలో శిశువు లింగ సమాచారం అడగమని డిక్లరేషన్ తీసుకోవాలని, స్కానింగ్ పొందిన వారి వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేయాలన్నారు. ఫారం ఎఫ్‌లను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయానికి ప్రతీ నెల 5వ తేదీలోగా అందజేయాలని, ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేయాలని అడిగిన వారికి మూడు సంవత్సరాల జైలుశిక్ష పడుతుందని హెచ్చరించారు. శారదానగర్‌లోని నర్సింగ్ కళాశాలను సందర్శించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, భోజన వివరాలను తెలుసుకున్నారు. నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రసన్న ఉన్నారు.