Share News

ధాన్యం కొనుగోళ్లతో సింగిల్‌ విండోల బలోపేతం

ABN , Publish Date - May 23 , 2025 | 11:29 PM

ధాన్యం కొనుగోళ్లతోనే సింగిల్‌ విండోలు బలోపేతమయ్యాయని, ఆ అవకాశాన్ని గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కల్పించిందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. రెండున్నర కోట్ల రూపాయలతో నిర్మించిన కేడీసీసీబీ సుల్తానాబాద్‌ బ్రాంచి భవన సముదాయాన్ని శుక్రవారం ఎమ్మెల్యే, కేడీసీసీబీ జిల్లా అధ్యక్షుడు కొండూరి రవీందర్‌ రావుతో కలసి ప్రారంభించారు.

ధాన్యం కొనుగోళ్లతో సింగిల్‌ విండోల బలోపేతం

సుల్తానాబాద్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోళ్లతోనే సింగిల్‌ విండోలు బలోపేతమయ్యాయని, ఆ అవకాశాన్ని గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కల్పించిందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. రెండున్నర కోట్ల రూపాయలతో నిర్మించిన కేడీసీసీబీ సుల్తానాబాద్‌ బ్రాంచి భవన సముదాయాన్ని శుక్రవారం ఎమ్మెల్యే, కేడీసీసీబీ జిల్లా అధ్యక్షుడు కొండూరి రవీందర్‌ రావుతో కలసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతు 2012 కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న శ్రీధర్‌బాబు సహకార సంఘాలకు ధాన్యం కొనుగోళ్ల బాధ్యతలను అప్పగించారని గుర్తు చేశారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలు ప్రతీ గ్రామంలో ఏర్పాటయ్యే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. ఎలాంటి కటింగ్‌లు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు.

సింగిల్‌ విండోలకు సోలార్‌ యూనిట్లు

జిల్లా సహకార సంఘాలకు ప్రభుత్వం సోలార్‌ యూనిట్లను మంజూరు చేయడం సంతోషకరమని కేడీసీసీబీ జిల్లా అధ్యక్షుడు కొండూరి రవీందర్‌ రావు అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో రెండు యూనిట్లు, రామగుండం, మంథని నియోజకవర్గాలలో ఒకటి చొప్పున సోలార్‌ యూనిట్లను ఏర్పాటు చేసి విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభిస్తామన్నారు. విద్యుత్‌ ఉత్పత్తితో ఆయా సింగిల్‌ విండోలు ఆర్థికంగా పురోగతి సాధిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతటి అన్నయ్య గౌడ్‌, మార్కెట్‌ చైర్మన్‌ మినుపాల ప్రకాశ్‌ రావు, కేడీసీీసీబీ ఉపాధ్యక్షుడు పింగళి రమేష్‌, సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే మోహన్‌రెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్‌ శ్రీగిరి శ్రీనివాస్‌, సీఈఓ సత్యనారాయణ రావు, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీమాల, డీజీఎం బ్రహ్మానందరావు, ఏజీఎం మహేష్‌, సాగర్‌ రెడ్డి, మేనేజర్‌ శశిధర్‌ రావు, కమిషనర్‌ నియాజ్‌, సొసైటీ సీఈఓలు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2025 | 11:29 PM