Share News

సోలార్‌ ప్రాజెక్టులతో సహకార సంఘాలు బలోపేతం

ABN , Publish Date - May 27 , 2025 | 12:13 AM

సహకార సంఘాల్లో సోలార్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటుతో విద్యుత్‌ ఉత్పత్తి చేయడంతో పాటు రైతులు విద్యుత్‌ అవసరాలను తీర్చుకోవచ్చని ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. పీఎం కుసుమ్‌ ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మం థని ఆధ్వర్యంలో గుం జపడుగులో ఏర్పాటు చేసే సోలార్‌ ప్రాజెక్టు ఎంవోయూ కుదుర్చుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.

సోలార్‌ ప్రాజెక్టులతో సహకార సంఘాలు బలోపేతం

మంథని, మే 26 (ఆంధ్రజ్యోతి): సహకార సంఘాల్లో సోలార్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటుతో విద్యుత్‌ ఉత్పత్తి చేయడంతో పాటు రైతులు విద్యుత్‌ అవసరాలను తీర్చుకోవచ్చని ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. పీఎం కుసుమ్‌ ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మం థని ఆధ్వర్యంలో గుం జపడుగులో ఏర్పాటు చేసే సోలార్‌ ప్రాజెక్టు ఎంవోయూ కుదుర్చుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కలెక్టర్‌ చొరవతో మంథని, అప్పన్నపేట, కాల్వశ్రీరాంపూర్‌, నందిమేడారం సహకార సంఘాల ద్వారా రూ.3 కోట్లతో ఏర్పాటు చేసే సోలార్‌ ప్రాజెక్టులకు నాబార్డు, కెడిసిసి బ్యాంక్‌ రుణం మంజూరుకు చేయడం అభినందనీయమన్నారు. ప్రజా ప్రభుత్వంలో మహిళా సం ఘాలు, సహకార సంఘాల ఆదాయ వనరులను పెంపొం దించడానికి సోలార్‌ ప్రాజెక్ట్‌ ఉపయోగపడుతుందని అన్నారు. కరీంనగర్‌ జిల్లా సహకార బ్యాంకు ద్వారా 7300 కోట్ల లావాదేవీలు జరగడం గొప్ప విషయమన్నారు. నాప్‌ స్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు మాట్లాడుతూ, సోలార్‌ ప్రాజెక్టు విద్యుత్‌ ఉత్పాదన ద్వారా సంవత్సరానికి రూ.55 లక్షల ఆదాయం సమకూరుతుందన్నారు. సహకార సంఘాల సంఘాల పరిస్థితి గతంలో అధ్వాన్నంగా ఉండే దని, ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి హయాంలో పౌర సరఫ రాల శాఖ మంత్రిగా ఉన్న దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆలోచన చేసి కేంద్రాల బాధ్యతను సంఘాలకు అప్పగించార న్నారు. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, జిల్లాలో ఏర్పాటు చేస్తున్న సోలార్‌ ప్రాజెక్టులకు నాబా ర్డు నిధులు మంజూరు చేసిందని, ఇందుకు కావాల్సిన స్థల సేకరణ జరిపి సంఘాలకు కేటాయిస్తామన్నారు. సింగిల్‌ విండో చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌ మాట్లాడుతూ రూ.3 కోట్లతో ఏర్పాటు చేసే సోలార్‌ ప్రాజెక్టును మంథనికి కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు 2లక్షల రుణమాఫీ, సన్నవడ్లకు రూ.500 బోనస్‌ అమలు చేస్తున్నారన్నారు. జిల్లా సహకార అధికారి శ్రీమాల, కెడిసిసీ బ్యాంక్‌ జిల్లా సిఈఓ సత్యనారాయణరావు, పీడిసి సెల్‌ ఇంఛార్జి సత్యనారాయణ, ఎన్‌పిడిసిఎల్‌ ఎస్‌ఈ హాజర య్యారు. సంఘం ఉపాధ్యక్షుడు ప్రకాష్‌రెడ్డి, డైరెక్టర్లు, ఆర్డీవో సురేష్‌, తహసీల్దార్‌ కుమారస్వామి, టిజిఈఆర్సీ సలహాదారు శశిభూషణ్‌ కాచే, ఆర్టీఐ మెంబర్‌ సురేష్‌, డీజీఎం బ్రహ్మానందం, ఏజీఎం లొకె రాజశేఖర్‌, మేనేజర్‌ ఉదయశ్రీ, డిఈ దిలీప్‌, రైతులు పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2025 | 12:13 AM