Share News

రక్షిత మంచినీటి సరఫరాకు చర్యలు చేపట్టాలి

ABN , Publish Date - Feb 17 , 2025 | 11:54 PM

స్వచ్ఛమైన రక్షిత మంచినీటిని సర ఫరా చేయడానికి బ్లీచింగ్‌, క్లోరినేషన్‌ ప్రక్రియ నిరంతరం చేపట్టాలని, ఉపరితల జలాశయాలను శుభ్ర పరచాలని రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్‌ అరుణశ్రీ కార్పొరేషన్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కార్పొరేషన్‌లోని వివిధ డివిజన్‌లను సందర్శించి నీటి సరఫరా, పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణ, పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులను పరిశీలించి అధికా రులకు పలు ఆదేశాలు జారీ చేశారు.

రక్షిత మంచినీటి సరఫరాకు చర్యలు చేపట్టాలి

కోల్‌సిటీ, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): స్వచ్ఛమైన రక్షిత మంచినీటిని సర ఫరా చేయడానికి బ్లీచింగ్‌, క్లోరినేషన్‌ ప్రక్రియ నిరంతరం చేపట్టాలని, ఉపరితల జలాశయాలను శుభ్ర పరచాలని రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్‌ అరుణశ్రీ కార్పొరేషన్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కార్పొరేషన్‌లోని వివిధ డివిజన్‌లను సందర్శించి నీటి సరఫరా, పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణ, పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులను పరిశీలించి అధికా రులకు పలు ఆదేశాలు జారీ చేశారు. హెలిపాడ్‌ ట్యాంక్‌, కృష్ణాన గర్‌, మల్కాపూర్‌, జంగాలపల్లి, న్యూ పోరట్‌పల్లి ప్రాంతాలలో పర్యటించారు. మురుగు నీటి కాలువలను, సీఎస్‌ఆర్‌ నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. వెలగని వీధి దీపాలకు మరమ్మతు చేయించాలని ఆదేశించారు. అనంతరం 39వ డివిజన్‌ ప్రగతినగర్‌ను సందర్శించారు. పైప్‌లైన్ల ద్వారా నీటి సరఫరా జరుగుతున్నం దున ఇంధనం ఆదా చేయడానికి, నీటి వృధాను అరికట్టడానికి పవర్‌ బోర్‌ స్థానంలో చేతి పంపు అమర్చాలని ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్‌ వెంకటస్వామి, ఈఈ రామన్‌, ఎఈ తేజస్విని పాల్గొన్నారు.

నీటి కొరత లేకుండా చూడాలి

కార్పొరేషన్‌లో వేసవిలో నీటి కొరత రాకుండా చూడాలని, ప్రజల నుంచి ఫిర్యాదులు లేకుండా నీటి ఎద్దడిని తీర్చాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ అరుణశ్రీ అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్‌ కార్యాలయంలో నీటి సరఫరా విభాగం, ఇంజనీరింగ్‌, రెవెన్యూ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ కోటి రూపాయల అంచనాతో వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని, ప్రతీ ఇంటికి తగినంత నీటి సరఫరా జరిగే విధంగా చూడా లన్నారు. లీకేజీ ఉంటే యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేయాలని, పైప్‌ లైన్ల అవసరం ఉన్న ప్రాంతాలను గుర్తించాలన్నారు. నల్లా బకాయిలు పేరు కుపోయాయని, వసూలు చేయడానికి లైన్‌మెన్లు, బిల్‌ కలెక్టర్లు, వార్డు అధి కారులు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి రోజువారి లక్ష్యం ప్రకారం వసూలు చేయాల న్నారు. కార్పొరేషన్‌లో వంద శాతం ఇంటి పన్ను బకాయిలు వసూలు చేయాలని సూచించారు. ఆమె మాట్లాడుతూ పన్నులు చెల్లించని వారికి ఇప్పటికే రెడ్‌ నోటీసులు జారీ చేశామని, అందులో కొందరు పన్నులు చెల్లిం చారని చెప్పారు. క్షేత్రస్థాయిలో పన్నులు కట్టించే విధంగా అధికారులు ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ప్రజలు పన్ను చెల్లించి నగరాభివృద్ధికి సహక రించాలని కోరారు. డిప్యూటీ కమిషనర్‌ వెంకటస్వామి, రెవెన్యూ అధికారి ఆంజనేయులు, ఆర్‌ఐ శంకర్‌రావు, ఈఈ రామన్‌, డీఈలు హన్మంత్‌నా యక్‌, శాంతిస్వరూప, షాబాద్‌, జమీల్‌, ఏఈలు, పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2025 | 11:54 PM