ఖేలో ఇండియాతో వెలుగులోకి క్రీడాకారుల ప్రతిభ
ABN , Publish Date - Dec 07 , 2025 | 11:48 PM
ఖేలో ఇండియాతో మారుమూల పల్లెల్లో ప్రతిభ గల క్రీడాకారులను వెలుగులోకి వస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు, టోర్నమెంట్ ఆర్గనైజర్ బెజ్జంకి దిలీప్ నేతృత్వంలో నెలరోజులుగా కొనసాగుతున్న క్రికెట్ మ్యాచ్ ఫైనల్ ఆదివారం జరిగింది.
పెద్దపల్లి కల్చరల్, డిసెంబరు7(ఆంధ్రజ్యోతి): ఖేలో ఇండియాతో మారుమూల పల్లెల్లో ప్రతిభ గల క్రీడాకారులను వెలుగులోకి వస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు, టోర్నమెంట్ ఆర్గనైజర్ బెజ్జంకి దిలీప్ నేతృత్వంలో నెలరోజులుగా కొనసాగుతున్న క్రికెట్ మ్యాచ్ ఫైనల్ ఆదివారం జరిగింది. బహుమతుల ప్రదానోత్సవంలో మాట్లాడుతూ మెరుగైన క్రీడాకారులను తయారు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. ప్రతి జిల్లాలో సకల హంగులతో మిని స్టేడియం నిర్మిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేక పోయిందని ఎద్దేవా చేశారు. క్రీడాకారులు ఇదే స్ఫూర్తిని ప్రదర్శించి జాతీయస్థాయిలో జిల్లాకు పేరు తీసుకురావాలని ఆయనకోరారు. అలాగే జిల్లా కేంద్రంలో ఉండాల్సిన కోర్టు, ఊరికి పది కిలోమీటర్ల దూరంలో నిర్మించడం వల్ల కక్షిదారులు, న్యాయవాదులు, ప్రజలకు ఇబ్బందిగా ఉంటుందన్నారు. ఎమ్మెల్యే మౌనం వహించడంలోని ఆంతర్యం ఏంటని ఆయన ప్రశ్నించారు. టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ పెద్దపల్లి -గోదావరిఖని జట్ల మధ్య జరగగా, పెద్దపల్లి జట్టు విజేతగా నిలిచింది. విజేతకు రూ.50 వేలు, రన్నర్ జట్టుకు రూ.25 వేల ప్రైజ్‌మనీతోపాటు ట్రోఫీని బహుకరించారు.బీజేపీ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్‌రెడ్డి, మిట్టపల్లి ప్రవీణ్ కుమార్, సౌదరి మహేందర్, శివంగారి సతీష్, రాధాస్వామి, రామగిరి అఖిల్, బొడ్డుపల్లి శ్రీనివాస్, ఠాకూర్ సాయిసతీష్ సింగ్, గౌస్‌పాషా, శివంగారి రాజేష్, దేవనంది శ్రవణ్, సందీప్, రుమాన్, జునైద్, పెంచాల సంతోష్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.