Share News

అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి

ABN , Publish Date - Dec 02 , 2025 | 12:01 AM

రామగుం డం నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో అదనపు కలెక్టర్‌, కమిషనర్‌ అరుణశ్రీ, ఇంజనీరింగ్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, కాంట్రాక్టర్లతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహిం చారు.

అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి

కోల్‌సిటీ, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): రామగుం డం నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో అదనపు కలెక్టర్‌, కమిషనర్‌ అరుణశ్రీ, ఇంజనీరింగ్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, కాంట్రాక్టర్లతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహిం చారు. రాజీవ్‌ రహదారి పక్కన సర్వీస్‌ రోడ్ల నిర్మా ణం వెంటనే మొదలు పెట్టాలని, పని ఆగకూడ దన్నారు. రామగుండంలో రహదారి నిర్మాణం కూడా త్వరిగతిన పూర్తి చేయాలన్నారు. ఇప్పుడు అభివృద్ధి పనులు జరిగేందుకు అవకాశం ఉన్న సమయమని, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, మంచినీటి పైప్‌లైన్లు, సీసీ రోడ్ల నిర్మాణం త్వరితగతిన చేయా లన్నారు. అనంతరం అధికారులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించారు. కళ్యాణ్‌నగర్‌ జంక్షన్‌, అబ్దుల్‌ కలాం జంక్షన్లను అభివృద్ధి చేయాలన్నారు. రమేష్‌నగర్‌ చౌరస్తా నుంచి అబ్దుల్‌ కలాం జంక్షన్‌ వరకు రహదారిని విస్తరించాలన్నారు. అలాగే వ్యాపార కేంద్రమైన లక్ష్మీనగర్‌, కళ్యాణ్‌నగర్‌లలో ఎన్ని రోజులు పనులు చేస్తారని ఆయన అధికా రులు, కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఫుట్‌పాత్‌ల నిర్మాణం పూర్తిచేసి విద్యుత్‌లైన్లకు కనె క్షన్లు ఇవ్వాలని, పాత విద్యుత్‌ పోల్స్‌ను తొలగిం చాలని సూచించారు. వ్యాపార స్థులు, ప్రజలకు ఇబ్బందులు కలుగకుం డా వెంటనే పనులు పూర్తి చేయాల న్నారు. ఆయన వెంట నగరపాలక సంస్థ ఈఈ రామన్‌, టీపీఎస్‌ నవీన్‌, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్వర్‌రావు, నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు బొంతల రాజేష్‌, మాజీ కార్పొరేటర్లు మహంకాళి స్వామి, రాజ్‌కుమార్‌, ముస్తాఫా, నాయకులు పెద్దెల్లి ప్రకాష్‌, పాతపెల్లి ఎల్లయ్య, గట్ల రమేష్‌, దశరథం పాల్గొన్నారు.

Updated Date - Dec 02 , 2025 | 12:01 AM