Share News

అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి

ABN , Publish Date - Feb 21 , 2025 | 12:12 AM

రామ గుండంలో టీయూఎఫ్‌ఐడీసీ, ఎస్‌డీఎఫ్‌ నిధు లతో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెం చాలని కలెక్టర్‌, రామగుండం మున్సిపల్‌ కార్పొ రేషన్‌ ప్రత్యేకాధికారి కోయ శ్రీహర్ష అధికారు లను ఆదేశించారు. గురువారం కమిషనర్‌ అరుణశ్రీతో కలిసి ఇంజనీరింగ్‌, టౌన్‌ ప్లానింగ్‌, శానిటేషన్‌, రెవెన్యూ విభాగం అధికారులతో సమావేశం నిర్వహించారు.

అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి

కోల్‌సిటీ, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): రామ గుండంలో టీయూఎఫ్‌ఐడీసీ, ఎస్‌డీఎఫ్‌ నిధు లతో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెం చాలని కలెక్టర్‌, రామగుండం మున్సిపల్‌ కార్పొ రేషన్‌ ప్రత్యేకాధికారి కోయ శ్రీహర్ష అధికారు లను ఆదేశించారు. గురువారం కమిషనర్‌ అరుణశ్రీతో కలిసి ఇంజనీరింగ్‌, టౌన్‌ ప్లానింగ్‌, శానిటేషన్‌, రెవెన్యూ విభాగం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడు తూ నాలాల ఆధునికీకరణ పనులు త్వరితగ తిన పూర్తి చేయాలన్నారు. నాలాల భూములను పరిరక్షించేందుకు చర్యలు చేపట్టాలని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులను ఆదేశించారు. కాంట్రా క్టర్లు పనులు పూర్తిచేసిన వెంటనే బిల్లులు రికార్డు చేయాలన్నారు. కార్పొరేషన్‌ పరిధిలో ఆక్రమణలు లేకుండా చూడాలని ఆదేశించారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది పన్నుల వసూ ళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, లక్ష్యాన్ని చేరుకు నేందుకు కృషి చేయాలన్నారు. పారిశుధ్య నిర్వ హణకు యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించుకోవాలని, కొనుగోలు చేసిన ఆటోలు, ట్రాక్టర్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. నగరంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, నిర్దేశిత షెడ్యూల్‌ను అనుసరించాలన్నారు. రోడ్లపై ఎక్కడ చెత్త లేకుండా చూసుకోవాల న్నారు. ఎస్‌ఈ శివానంద్‌, ఈఈ రామన్‌, టౌన్‌ ప్లానింగ్‌ ఏసీపీ శ్రీధర్‌ ప్రసాద్‌, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.

పౌష్టికాహారం అందించాలి

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు పౌష్టి కాహారం అందించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. రామగుండం పరిధిలోని అంగన్‌ వాడీ కేంద్రాల పనితీరుపై సమావేశం నిర్వహించారు. ప్రతీ సూపర్‌వైజర్‌ తమ పరిధి లోని అంగన్‌వాడీ కేంద్రాల వద్దకు వెళ్లి నిత్యం మానిట రింగ్‌ చేయాలని, పౌష్టికాహారం అందేలా చూడాలన్నారు. న్యూట్రిషియన్‌కు సంబంధించి వాస్తవిక పరిస్థితులను నమో దు చేయాలని, పోషకలోపంతో బాధపడుతున్న పిల్లలకు బాలా మృతం అంద జేయాలని సూచించారు. ప్రతీ నెల పిల్లల బరు వు చెక్‌ చేయాలని, తక్కువ బరువు ఉంటే అవ సరమైన పోషకాలు అందించాలన్నారు. మాన సిక వైకల్యం ఉన్న పిల్లలను గుర్తించి వారిని మనో చైతన్య పాఠశాలలో చేర్పించేందుకు ప్రతి పాదనలు తయారు చేయాలని కలెక్టర్‌ ఆదేశిం చారు. గ్రామాల్లో క్రోనిక్‌ వ్యాధిని గుర్తించిన 14 మందికి వైద్యశాఖ ద్వారా చికిత్స అందేలా చూడాలన్నారు. జిల్లా సంక్షేమాధికారి వేణుగోపాల్‌, సీడీపీఓ అలేఖ్య పాల్గొన్నారు.

Updated Date - Feb 21 , 2025 | 12:12 AM