Share News

తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సోనియాగాంధీ

ABN , Publish Date - Dec 09 , 2025 | 11:55 PM

నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చారని కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు బొంతల రాజేష్‌ అన్నారు. మంగళ వారం ఆమె జన్మదినం సందర్భంగా కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్‌ ఆధ్వ ర్యంలో ఖని చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్య క్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కేక్‌కట్‌ చేశారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సోనియాగాంధీ

కళ్యాణ్‌నగర్‌, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చారని కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు బొంతల రాజేష్‌ అన్నారు. మంగళ వారం ఆమె జన్మదినం సందర్భంగా కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్‌ ఆధ్వ ర్యంలో ఖని చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్య క్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కేక్‌కట్‌ చేశారు. కాల్వ లింగస్వామి, గట్ల రమేష్‌, రాజేష్‌, కొప్పుల శంకర్‌, చుక్కల శ్రీనివాస్‌, ఫజల్‌ బేగ్‌, బొంతల లచ్చన్న, దాసరి విజయ్‌ పాల్గొన్నారు. మంథని వెంకటేష్‌ ఆధ్వర్యంలో రమేష్‌నగర్‌లో సోనియాగాంధీ జన్మదినం సం దర్భంగా కేక్‌కట్‌ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. లక్ష్మణ్‌బాబు నారాయణ, రవి యాదవ్‌, ఖలీం, అనీల్‌, శ్రీధర్‌ పాల్గొన్నారు.

సుల్తానాబాద్‌, (ఆంధ్రజ్యోతి): ప్రజల ఆకాంక్షలను గౌరవించి తెలంగాణ రాష్ట్రాన్ని సోనియాగాంధీ ఇచ్చారని జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్‌ , మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మినుపాల ప్రకాశ్‌ రావు అన్నారు. సోనియా గాంధీ జన్మదినం పురస్కరించుకుని కేక్‌ కట్‌ చేశారు. శ్రీగిరి శ్రీనివాస్‌, దామోదర్‌రావు, మహేందర్‌, అబ్బయ్యగౌడ్‌, రాజయ్య, పాల్గొన్నారు.

మంథని, (ఆంధ్రజ్యోతి): సోనియా గాంధీపుట్టిన రోజు వేడుకలను కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు అంబేద్కర్‌ చౌక్‌లో నిర్వహిం చారు. కేక్‌ కట్‌ చేసి, స్వీట్లు పంపిణీ చేశా రు. మం డల పార్టీ అధ్యక్షుడు ఐలి ప్రసాద్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌, ఏఎంసీ చైర్మన్‌ కుడుదుల వెంకన్న, మున్సిసల్‌ చైర్‌పర్సన్‌ పెండ్రి రమ-సురేష్‌రెడ్డి, పాల్గొన్నారు.

ఎలిగేడు/జూలపల్లి, (ఆంధ్రజ్యోతి): ఎలిగేడు, జూలపల్లి మండలాల్లో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్‌ నాయకు లు నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి, స్వీట్లు పంచుకున్నారు. యూత్‌ కాంగ్రెస్‌ మాజీ మం డల అధ్యక్షుడు మానుమండ్ల శ్రీనివాస్‌ ఆధ్వ ర్యంలో కాంగ్రెస్‌ శ్రేణులతో కలిసి నిర్వహిం చారు. కొమ్మ పోచాలు, బండి స్వామి, సామ రాజేశ్వర్‌రెడ్డి, సంతోష్‌రావు, పాల్గొన్నారు.

Updated Date - Dec 09 , 2025 | 11:56 PM