Share News

మేళాలో ప్రజల సమస్యలు పరిష్కారం

ABN , Publish Date - Feb 26 , 2025 | 12:27 AM

మున్సిపల్‌ కార్యాలయంలో నిర్వహించిన ఎల్‌ఆర్‌ఎస్‌, ట్రేడ్‌ లైసెన్స్‌, రెవెన్యూ మేళాలో పలు సమస్యలు పరిష్కారమయ్యా యి. ఈనెల 10 నుంచి మంగళవారం వరకు మున్సిపల్‌ కార్యాలయంలో మేళాలు నిర్వహించారు. ఇందులో డ్యాక్యూమెంట్లలో వివిధ రకాల తప్పులు, ప్రభుత్వ భూముల సర్వే నంబర్‌లలో ఉన్న ప్రైవేట్‌ భూములను సర్వే చేయించారు.

మేళాలో ప్రజల సమస్యలు పరిష్కారం

పెద్దపల్లిటౌన్‌, ఫిబ్రవరి 25 (ఆంఽధ్రజ్యోతి) మున్సిపల్‌ కార్యాలయంలో నిర్వహించిన ఎల్‌ఆర్‌ఎస్‌, ట్రేడ్‌ లైసెన్స్‌, రెవెన్యూ మేళాలో పలు సమస్యలు పరిష్కారమయ్యా యి. ఈనెల 10 నుంచి మంగళవారం వరకు మున్సిపల్‌ కార్యాలయంలో మేళాలు నిర్వహించారు. ఇందులో డ్యాక్యూమెంట్లలో వివిధ రకాల తప్పులు, ప్రభుత్వ భూముల సర్వే నంబర్‌లలో ఉన్న ప్రైవేట్‌ భూములను సర్వే చేయించారు. మ్యూటేషన్‌, ఆస్తి పన్ను హెచ్చు తగ్గులను సరిదిద్ది పన్ను చెల్లించే ఏర్పాటు చేశారు. కొత్త ఇంటి నంబర్లు జారీ చేయడంతో పాటు గతంలో ఇంటి నంబర్లు లేని వారికి ఇచ్చేందుకు చర్యలు తీసు కున్నారు. వారసత్వ ఇండ్ల యజ మానుల పేర్ల మార్పిడి చేశారు. వారస్తత్వంగా వచ్చిన, పొత్తుల ఆస్తులు విడదీసి వారసుల పేర్లు ఎక్కించారు. ట్రేడ్‌ లైసన్స్‌లు లేని వ్యాపారులకు జరిమానాలు లేకుండా లైసెన్స్‌లు ఇవ్వడంతో పాటు పాత ట్రేడ్‌ లైసెన్సులు రిన్యూవల్‌ చేశారు.

మేళాకు వచ్చిన దరఖాస్తులు ఇలా...

ఈ మేళాలో పలు సమస్యలపై 330 దరఖాస్తులు వచ్చాయి. ఎల్‌ఆర్‌ఎస్‌కు 150 మంది దరఖాస్తు చేసుకోగా 34 పరిష్కరించారు. దీని ద్వారా రూ.12 లక్షల ఆదాయం వచ్చింది. రెవెన్యూ మేళాలో 120 దరఖాస్తులు రాగా వాటి పరిష్కారంతో రూ.4 లక్షల 12 వేల ఆదా యం, ట్రైడ్‌ లైసెన్స్‌ మేళాలో 60 దరఖాస్తులను పరిశీ లించి నూతన లైసెన్స్‌లు జారీ చేశారు. వీటి ద్వారా రూ.2లక్షల 15 వేల ఆదాయం ఖాజానాకు చేరింది. మొత్తం రూ.16 లక్షల 27వేల ఆదాయం వచ్చింది. మం గళవారంతో ముగిసినప్పటికి దరఖాస్తులను స్వీకరించేం దుకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయనున్నారు.

మేళాలు మంచి ఫలితాలిచ్చాయి

కమిషనర్‌ ఆకుల వెంకటేష్‌

15 రోజుల పాటు నిర్వహించిన మేళాలు మంచి ఫలితాలనిచ్చాయి. సమస్యలు పరిష్కరించి ఎల్‌ఆర్‌ఎస్‌, ట్రేడ్‌ లైసన్స్‌, రెవెన్యూ మేళాల ఫీజలు వసూల్‌ చేశాం, వ్యాపారస్తులు ట్రేడ్‌ లైసన్సులు తీసుకోవడంతో పాటు రెన్యూవల్‌ చేసుకున్నారు. ఈ ప్రక్రియను యథావిధిగా కొనసాగిస్తాం.

Updated Date - Feb 26 , 2025 | 12:27 AM