లారీ యజమానుల సమస్యలను పరిష్కరిస్తా
ABN , Publish Date - Jul 20 , 2025 | 12:16 AM
రామగుండం ఏరి యా లారీ యజమానులు, డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేం దుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. శనివారం గంగానగర్‌లోని లారీ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు.
కళ్యాణ్‌నగర్, జూలై 19(ఆంధ్రజ్యోతి): రామగుండం ఏరి యా లారీ యజమానులు, డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేం దుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. శనివారం గంగానగర్‌లోని లారీ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. లారీ డ్రైవర్లకు, యజమానులకు నుంచి సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, ఆర్‌ఎఫ్‌సీఎల్ అధికా రులతో చర్చించి లారీలకు యూరియా రవాణా ఇప్పిం చేందుకు కృషి చేస్తానని చెప్పారు.
హెచ్‌కేఆర్ యాజమా న్యంతో మాట్లాడి టోల్‌ఫీజు తగ్గించినందుకు లారీ అసోసి యేషన్ నాయకులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. నాయ కులు బొంతల రాజేష్, మహంకాళి స్వామి, తిప్పారపు శ్రీని వాస్, ముస్తాఫా, లారీ అసోసియేషన్ నాయకులు పాల్గొ న్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యమని ఎమ్మె ల్యే అన్నారు. 7వ డివిజన్ అధ్యక్షుడు ఎండీ నజీమ్ ఆధ్వ ర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్‌కార్డు ఇవ్వలేదని, డివిజన్లలో రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనే జీ, విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తూ రామగుండాన్ని సుం దరీకరంగా తీర్చిదిద్దమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.