సైన్యానికి మద్దతుగా సంఘీభావ ర్యాలీ
ABN , Publish Date - May 10 , 2025 | 11:18 PM
దేశ ప్రజల రక్షణ కోసం సరిహద్దుల్లో పాకిస్థాన్‌తో యుద్ధం చేస్తున్న దేశ సైని కుల వీరోచిత పోరాటానికి సలాం చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు కొనియాడారు. బీఆర్‌ఎస్ నియో జకవర్గ ఇంచార్జి పుట్ట మధు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు దేశ సైనికులకు సంఘీభావంగా ఫూలే చౌక్ నుంచి అంబేద్కర్, జగ్జీవన్‌చౌక్, గాంధీచౌక్ వరకు జాతీయ జెండాలు చేతిలో పట్టుకొని ఊరేగింపు నిర్వహించారు.
కళ్యాణ్‌నగర్, మే 10(ఆంధ్రజ్యోతి): సైన్యానికి మద్ద తుగా శనివారం రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వ ర్యంలో మున్సిపల్ టీ జంక్షన్ నుంచి గోదావరిఖని ప్రధాన చౌరస్తా వరకు సంఘీభావ ర్యాలీ నిర్వహిం చారు. రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షుడు బల్మూరి అమరేం దర్‌రావు మాట్లాడుతూ పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవా దులకు బుద్ధి చెప్పడానికి ఆపరేషన్ సింధూర్ పేర భారత సైన్యం పోరాటం చేస్తుందని, దీనికి తాము సం పూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో మన జవాన్లు అమరులయ్యారని, వారి సేవలు మరువలేనివన్నారు. జాతీయ జెండాలతో చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. సభ్యులు మంథని శ్రీనివాస్, చెరుకు బుచ్చిరెడ్డి, అశోక్‌రావు, జీవన్‌బాబు, తిరుపతిరెడ్డి, రాజిరెడ్డి, రాజేంద్ర కుమార్, రామస్వామి, సుధాకర్, శంతన్‌కుమార్, శ్రీనివాస్, సత్యనారాయణ, పొలాడి శ్రీనివాసరావు, సదయ్య, ప్రవీణ్ పాల్గొన్నారు.
మంథని, (ఆంధ్రజ్యోతి): దేశ ప్రజల రక్షణ కోసం సరిహద్దుల్లో పాకిస్థాన్‌తో యుద్ధం చేస్తున్న దేశ సైని కుల వీరోచిత పోరాటానికి సలాం చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు కొనియాడారు. బీఆర్‌ఎస్ నియో జకవర్గ ఇంచార్జి పుట్ట మధు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు దేశ సైనికులకు సంఘీభావంగా ఫూలే చౌక్ నుంచి అంబేద్కర్, జగ్జీవన్‌చౌక్, గాంధీచౌక్ వరకు జాతీయ జెండాలు చేతిలో పట్టుకొని ఊరేగింపు నిర్వహించారు. పుట్ట మధు మట్లాడుతూ దేశం కోసం వీరోచితంగా పోరాడుతున్న వారి త్యాగాలు వెలకట్టలేనివన్నారు. సైని కుల కుటుంబాలకు అండగా ఉండాలన్నారు. యుద్ధంలో మృతి చెందిన అమర జవాన్లకు, ఉగ్రవాదుల చేతుల్లో మృతి చెందిన టూరిస్టులకు నివాళులర్పించారు. నేతలు జక్కు రాకేష్, మాచీడి రాజుగౌడ్, ఏగోళపు శంకర్‌గౌడ్, తగరం శంకర్‌లాల్, జంజర్ల శేఖర్, కన్నూరి శ్రీశైలం, కుమార్, ఆసీఫ్, పాల్గొన్నారు.