చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుంది
ABN , Publish Date - Dec 12 , 2025 | 12:54 AM
చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుందని, ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని కార్పొరేట్ సేఫ్టీ జీఎం సాయిబాబు, ఆర్‌జీ-1 జీఎం లలిత్ కుమార్ అన్నారు.
గోదావరిఖని, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుందని, ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని కార్పొరేట్ సేఫ్టీ జీఎం సాయిబాబు, ఆర్‌జీ-1 జీఎం లలిత్ కుమార్ అన్నారు. మంగళవారం ఆర్‌జీ-1 పరిధిలో జీడీకే 11ఇంక్లైన్‌పై 56వ వార్షిక రక్షణ పక్షోత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరై రక్షణ జెండాను ఆవిష్కరించి ఉద్యోగులతో రక్షణ ప్రతిజ్ఞను చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం మరిచిపోకుండా గుర్తు చేయడమే ఒక సమీక్ష లాటిందని, ప్రతి ఒక్కరూ రక్షణలో ముందుకు సాగుతూ నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తే సంస్థకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. రక్షణపై అవగాహనతో పనులు చేస్తూ సంస్థ అభివృద్ధికి పాటుపడాలని వారు పిలుపునిచ్చారు. రక్షణ విషయంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు బహుమతులను ప్రదానం చేశారు. అనంతంర రక్షణ కమిటీ సభ్యులు అండర్ గ్రౌండ్‌లోని 1సీఎంకు వెళ్లి రూఫ్, సైడ్ వాల్, అక్కడ తీసుకుంటున్న రక్షణ చర్యలను, జాగ్రత్తలను కార్మికులను అడిగి తెలుసుకు న్నారు. కార్యక్రమంలో సైదులు, మధుసూదన్, చంద్రశేఖర్, చిలుక శ్రీనివాస్, మడ్డి ఎల్లయ్య, శ్రీనివాస్, దేశాయ్, మహేందర్, శ్రీనివాస్, సునీల్ కుమార్, ఆదినారాయణ, వెంకటస్వామి, మల్లేషం, రాందాస్, నాయిని శంకర్ పాల్గొన్నారు.