Share News

బొగ్గు గనుల వేలం పాటలతో సింగరేణికి నష్టం

ABN , Publish Date - Dec 23 , 2025 | 12:26 AM

జాతీయ సంపద అయిన బొగ్గు గనులను ప్రభుత్వ నడపకుండా ప్రైవేటు వారికి కట్టబెట్టేలా తెచ్చిన వేలం పాటల వల్ల సింగరేణికి, కోల్‌ ఇండియాకు భవిష్యత్తు లేకుండా అవుతుందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి అన్నారు. సోమవారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మణుగూరులోని పీకే ఓసి డిసైడ్‌ ఎక్స్‌టెన్షన్‌ 2బ్లాక్‌ను వేలం పాటలో పెట్టారన్నారు.

బొగ్గు గనుల వేలం పాటలతో సింగరేణికి నష్టం

గోదావరిఖని, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): జాతీయ సంపద అయిన బొగ్గు గనులను ప్రభుత్వ నడపకుండా ప్రైవేటు వారికి కట్టబెట్టేలా తెచ్చిన వేలం పాటల వల్ల సింగరేణికి, కోల్‌ ఇండియాకు భవిష్యత్తు లేకుండా అవుతుందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి అన్నారు. సోమవారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మణుగూరులోని పీకే ఓసి డిసైడ్‌ ఎక్స్‌టెన్షన్‌ 2బ్లాక్‌ను వేలం పాటలో పెట్టారన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ రెండు జేఏసీలు సింగరేణి కేటాయించాలని అంటున్నాయని, అసలు ఎవరు వేలంలో పాల్గొన్న అది ప్రైవేట్‌ వారికే వెళ్లే అవకాశం ఉన్నదన్నారు. వేలం పాటలో పాల్గొన్న సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇవ్వాల్సి వస్తుందని, అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం తమ వంతు బాధ్యతగా హెచ్చరిక చేసి బిడ్డింగ్‌లో పాల్గొనకుండా చూడాలన్నారు. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా లకు రూ.80వేల కోట్లకు పైగా సింగరేణి సంస్థ డివిడెంట్లు చెల్లించిందని, రాష్ట్ర ప్రభుత్వం నిధులకు అవసరమైనప్పుడు సింగరేణిని వాడుకుంటూ సంస్థకు రావాల్సిన బకాయిలు ఇప్పించడానికి ముందుకు రావడం లేద న్నారు.

సీఎస్‌ఆర్‌, డీఎం ఎఫ్‌టీ నిధులే కాకుండా జాబ్‌ మేళా అని ఇతరత్ర అవసరాలకు, స్థానిక ప్రజాప్రతినిధులు సింగరేణి సంస్థను వాడుకుంటున్నా రని, బొగ్గు బావులు ఇప్పించడానికి కేంద్రంపై ఒత్తిడి చేయడానికి ముం దుకు రావడం లేదన్నారు. ఇప్పుడు వేలంపాటలో వేసిన పీకే ఓసి డిసైడ్‌ ఎక్స్‌టెన్షన్‌ 2బ్లాక్‌ 1/70యాక్ట్‌ పరిధిలో ఉన్నందున ఎక్కడ వేలంపాట వేయడం కుదరదని, సింగరేణికి కొత్త గనులు కేటాయించి అనుమతులు వచ్చేలా చూడాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఉక్కును ఏ విధంగా అయితే నష్టం చేశారో అదేవిధంగా సింగరేణి సంస్థ కూడా చేయాలని చూస్తున్నందున ఇప్పటికైనా అందరం కలిసి ఒకే నినాదంతో సింగరేణికి బొగ్గు గనులు కేటాయించి సింగరేణి ద్వారా బొగ్గు తీసేలా చూడాలన్నారు. విలేకరుల సమావేశంలో సీఐటీయూ ఆర్‌జీ-1 అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మెండె శ్రీనివాస్‌, ఉపాధ్యక్షులు ఆసరి మహేష్‌, ఎస్‌కే గౌస్‌, వంగల శివరాంరెడ్డి, కొమ్ము రమేష్‌, ఇండ్ల రమేష్‌, ప్రభాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2025 | 12:26 AM