Share News

సింగరేణి పరిరక్షణకు ‘సింగరేణి పోరుగర్జన’

ABN , Publish Date - Dec 01 , 2025 | 12:00 AM

సింగరేణి కార్మిక సం ఘాల ఐక్యవేదిక హెచ్‌ఎంఎస్‌, ఐఎఫ్‌టీయూ, టీఎస్‌యూఎస్‌, ఏఐ ఎఫ్‌టీయూ, టీఎన్‌టీయూసీ, ఎస్‌జీ కేఎస్‌, ఐఎఫ్‌టీయూ ఏడు కార్మిక సంఘాల సమావేశం ఆదివారం హెచ్‌ఎంఎస్‌ కార్యాలయంలో యూ నియన్‌ ప్రధాన కార్యదర్శి రియాజ్‌ అహ్మద్‌ అధ్యక్షతన జరిగింది.

సింగరేణి పరిరక్షణకు ‘సింగరేణి పోరుగర్జన’

గోదావరిఖని, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): సింగరేణి కార్మిక సం ఘాల ఐక్యవేదిక హెచ్‌ఎంఎస్‌, ఐఎఫ్‌టీయూ, టీఎస్‌యూఎస్‌, ఏఐ ఎఫ్‌టీయూ, టీఎన్‌టీయూసీ, ఎస్‌జీ కేఎస్‌, ఐఎఫ్‌టీయూ ఏడు కార్మిక సంఘాల సమావేశం ఆదివారం హెచ్‌ఎంఎస్‌ కార్యాలయంలో యూ నియన్‌ ప్రధాన కార్యదర్శి రియాజ్‌ అహ్మద్‌ అధ్యక్షతన జరిగింది. నాయ కులు సింగరేణి పరిరక్షణ కోసం చర్చించి కార్మికులకు పిలుపునిచ్చారు. ఈనెల 14న సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో కార్మిక సంఘాలు, మేధావులతో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించానికి నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్స్‌ రద్దు చేసే వరకు ఉద్యమించాలని, నాలుగు బొగ్గు బ్లాకులు సింగరేణికే చెందేట ట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడాలని, కార్మికులు ఎదుర్కొంటున్న మెడికల్‌ బోర్డును యథా విధిగా కొనసాగించాలన్నారు. మారుపేరు కార్మికుల వారసులకు ఉద్యోగాలు కల్పించడంలో జరుగు తున్న జాప్యానికి నిరసనగా, సింగరేణి భవిష్యత్‌ కోసం సింగరేణి పోరుగర్జన నిర్వహిస్తున్నట్టు, జనవరి 2 నుంచి 20వరకు నిర్వహిస్తున్నట్టు, కార్మిక వర్గం అంతా కలిసికట్టుగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. జీఎల్‌బీకేఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఐ కృష్ణ, టీఎస్‌యూఎస్‌ అధ్యక్షుడు కామర గట్టయ్య, ఏఐఎఫ్‌టీయూ అధ్యక్షుడు జీ రాములు, టీఎన్‌టీయూసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నిమ్మకాయల ఏడుకొండలు, ఎస్‌జీకేఎస్‌ అధ్యక్షులు ఎస్‌ మహేందర్‌, నాయకులు రాజయ్య, ఎం కుమారస్వామి, దావు రమేష్‌, రవి, చింతల శేఖర్‌, కొండి శ్రీనివాస్‌, ఎంఏ బేగ్‌, రాజపోషం పాల్గొన్నారు.

Updated Date - Dec 01 , 2025 | 12:00 AM