Share News

కూల్చివేతలను నిరసిస్తూ మౌన ప్రదర్శన

ABN , Publish Date - Dec 28 , 2025 | 12:06 AM

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయడాన్ని నిరసిస్తూ శనివారం అఖిలపక్షం ఆధ్వర్యంలో చౌరస్తా నుంచి లక్ష్మీనగర్‌, కళ్యాణ్‌నగర్‌ మీదుగా మౌన ప్రదర్శన నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ మాట్లాడుతూ రామగుండం నియజకవర్గంలో రాక్షస పాలన కొనసాగుతుందని, మల్లేష్‌ ఏడు రోజులుగా చౌరస్తాలో నిరసన దీక్ష చేస్తున్నా అధికారులు, పాలకులు న్యాయం చేయడం లేదని ఆరోపించారు.

కూల్చివేతలను నిరసిస్తూ మౌన ప్రదర్శన

గోదావరిఖని, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయడాన్ని నిరసిస్తూ శనివారం అఖిలపక్షం ఆధ్వర్యంలో చౌరస్తా నుంచి లక్ష్మీనగర్‌, కళ్యాణ్‌నగర్‌ మీదుగా మౌన ప్రదర్శన నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ మాట్లాడుతూ రామగుండం నియజకవర్గంలో రాక్షస పాలన కొనసాగుతుందని, మల్లేష్‌ ఏడు రోజులుగా చౌరస్తాలో నిరసన దీక్ష చేస్తున్నా అధికారులు, పాలకులు న్యాయం చేయడం లేదని ఆరోపించారు.

చిరు వ్యాపారుల దుకాణాలను కూల్చివేసి వారి జీవితాలను రోడ్డున పడవేస్తున్నారని, ఇప్పటికైనా ఎమ్మెల్యే బాధ్యత తీసుకుని మల్లేష్‌షాపును పునర్‌ నిర్మించాలని డిమాండ్‌ చేశారు. సింగరేణి యాజమాన్యం నిర్మిస్తున్న షాపులను బాధితులకు ఉచితంగా ఇవ్వాలని కోరారు. నిరసన ప్రదర్శనలో మూల విజయారెడ్డి, కౌశిక హరి, గోపు ఐలయ్యయాదవ్‌, పర్లపల్లి రవి, నారాయణదాసు మారుతి, కందుల సంధ్యారాణి, తోట వేణు, బుర్రి వెంకటేష్‌, కోమళ్ల మహేష్‌, పిడుగు కృష్ణ, కుమ్మరి శ్రీనివాస్‌, గాదం విజయ, బాదె అంజలి, కవిత సరోజిని, మెతుకు దేవరాజ్‌, ఇరుగురాళ్ల శ్రావణ్‌, గుంపుల లక్ష్మి, కనకలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2025 | 12:06 AM