పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించాలి
ABN , Publish Date - Feb 07 , 2025 | 11:51 PM
పదో తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని జిల్లా కోర్టు సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.స్వప్నరాణి విద్యార్థులకు సూచిం చారు. గర్రెపల్లి గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్, కాలేజీని జడ్జి శుక్రవారం తనిఖీ చేశారు.

సుల్తానాబాద్, ఫిబ్రవరి 7: (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని జిల్లా కోర్టు సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.స్వప్నరాణి విద్యార్థులకు సూచిం చారు. గర్రెపల్లి గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్, కాలేజీని జడ్జి శుక్రవారం తనిఖీ చేశారు. పలు తరగతి గదులను పరిశీలిస్తూ విద్యా ర్థులతో మాట్లాడారు. విద్యాలయం ఆవరణ పరిశుభ్రంగా ఉంచాల న్నారు. విద్యార్థులకు నాణ్యమైన రుచితో కూడిన ఆహారాన్ని అందిం చాలని అన్నారు. తరగతి గదుల్లో పిల్లలకు జరుగుతున్న బోధనలు, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ, ప్రయోగశాలలు, గ్రంథాలయం తదితర వాటిని పరిశీలించారు. జడ్జి మాట్లాడుతు పదో తరగతి పరీక్ష లను ఎలాంటి భయం లేకుండా రాసి మంచి ఫలితాలు సాధించాలని అన్నారు. మాడల్ స్కూల్ ఇంచార్జి ప్రిన్సిపాల్ కొండయ్య ఉన్నారు.