Share News

ముగిసిన ఎస్‌జీఎఫ్‌ జిల్లా స్థాయి క్రీడలు

ABN , Publish Date - Sep 20 , 2025 | 11:25 PM

సుల్తానాబాద్‌లో రెండు రోజులుగా జరిగిన జిల్లా స్థాయి స్కూల్‌ గేమ్‌ ఫెడరేషన్‌ క్రీడా పోటీలు శనివారం రాత్రి ముగిసాయి. జూనియర్‌ కళాశాల మైదానంలో అండర్‌ 14, 17 విభాగాలకు చెందిన బాలబాలికల వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో పోటీలు పూర్తి కాగా, విజేతలకు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు, డీఈఓ మాధవి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు.

ముగిసిన ఎస్‌జీఎఫ్‌ జిల్లా స్థాయి క్రీడలు

సుల్తానాబాద్‌, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): సుల్తానాబాద్‌లో రెండు రోజులుగా జరిగిన జిల్లా స్థాయి స్కూల్‌ గేమ్‌ ఫెడరేషన్‌ క్రీడా పోటీలు శనివారం రాత్రి ముగిసాయి. జూనియర్‌ కళాశాల మైదానంలో అండర్‌ 14, 17 విభాగాలకు చెందిన బాలబాలికల వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో పోటీలు పూర్తి కాగా, విజేతలకు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు, డీఈఓ మాధవి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి క్రీడాకారుల సంక్షే మానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మినుపాల ప్రకాష్‌ రావు, స్పోర్ట్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు ముత్యాల రవీందర్‌, తిరుపతి, మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌, హైస్కూల్‌ హెచ్‌ఎం రత్నాకర్‌ రెడ్డి, జిల్లా క్రీడాశాఖ అధికారి అక్కపాక సురేష్‌, జిల్లా ఎస్జీఎఫ్‌ కార్య దర్శి లక్ష్మణ్‌, ఎంఈఓ రాజయ్య, గాజుల రాజమల్లు, మహేందర్‌, కుమా ర్‌కిషోర్‌, గుణపతి, కృష్ణ, వ్యాయామ ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక

ఓదెల, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఏ రంగంలోనైనా శ్రద్ధ, ఆసక్తి ఉంటే ఉన్నతస్థాయికి ఎదుగుతారని పొత్కపల్లి ఎస్‌ఐ రమేష్‌ అన్నారు. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన పొత్కపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల చెందిన ఉడత శ్రీవళ్లి, ఆళ్ళ శరణ్య లను శనివారం ఎస్‌ఐ రమేష్‌, ఉపాధ్యాయులు అభినందించారు. ఎస్‌ఐ మాట్లాడుతూ, క్రీడలు శారీరధారుడ్య, మానసికోల్లాసానికి ఉపయోగపడతాయని తెలి పారు. ప్రధానోపాధ్యాయుడు సాంబయ్య, పీడీ హరికృష్ణ, ఉపాధ్యా యులు పాల్గొన్నారు. అలాగే పిఎస్‌ లో ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ వేడుకలను నిర్వహించారు.

Updated Date - Sep 20 , 2025 | 11:25 PM