Share News

ఎన్టీపీసీలో భద్రత కట్టుదిట్టం

ABN , Publish Date - May 08 , 2025 | 11:37 PM

దేశ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఎన్టీపీసీ ప్రాజెక్టుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. దేశంలోనే కీలకమైన విద్యుత్‌ కేంద్రంగా గుర్తింపు పొందిన రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టులో భద్రతా వ్యవస్థను పటిష్ఠం చేశారు. దక్షిణాదిలోని అన్ని రాష్ట్రా లకు ఈప్రాజెక్టు నుంచి విద్యుత్‌ సరఫరా జరుగుతోంది.

ఎన్టీపీసీలో భద్రత కట్టుదిట్టం

జ్యోతినగర్‌, మే 8 (ఆంధ్రజ్యోతి): దేశ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఎన్టీపీసీ ప్రాజెక్టుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. దేశంలోనే కీలకమైన విద్యుత్‌ కేంద్రంగా గుర్తింపు పొందిన రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టులో భద్రతా వ్యవస్థను పటిష్ఠం చేశారు. దక్షిణాదిలోని అన్ని రాష్ట్రా లకు ఈప్రాజెక్టు నుంచి విద్యుత్‌ సరఫరా జరుగుతోంది. దేశంలోని అన్ని కీలక ప్రాజెక్టులలో అలర్ట్‌ ప్రకటించిన క్రమంలో కేంద్రం రామగుండం ప్రాజెక్టులో భద్రతా వ్యవస్థను పెంచాలని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. సీఐఎస్‌ఎఫ్‌(సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యురిటీ ఫోర్స్‌) కేంద్రం ఆదేశాలతో అప్రమత్తమైంది. రోజువారీ భద్రతను పెంచడంతోపాటు అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. డ్రోన్‌ దాడుతోపాటు విపత్తు సంభవిస్తే ప్రతి స్పందనకు సంబంధించి మాక్‌ డ్రిల్స్‌ నిర్వహిస్తున్నది. ప్రాజెక్టుకున్న అన్ని గేట్ల వద్ద తనిఖీలు చేపడుతున్నారు. 24 గంట నిఘాలో భాగంగా పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు. సీఐఎస్‌ఎఫ్‌కు చెందిన ఇంటెలిజెన్స్‌ బృం దాలు ఈ ప్రాంతంలో వివిధ వనరుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర నిఘా వ్యవస్థలతో సమన్వయం చేసుకుంటున్నారు.

Updated Date - May 08 , 2025 | 11:37 PM