Share News

భద్రత వ్యవస్థలను కట్టుదిట్టం చేయాలి

ABN , Publish Date - May 08 , 2025 | 11:39 PM

ఆపరేషన్‌ సింధూర్‌ నేపథ్యంలో భద్రత వ్యవస్థలను కట్టుదిట్టం చేయాలని రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా అన్నారు. గురువారం పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలోని సింగరేణి, ఎన్‌టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌తోపాటు ప్రభుత్వరంగ సంస్థల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

భద్రత వ్యవస్థలను కట్టుదిట్టం చేయాలి

కోల్‌సిటీ, మే 8(ఆంధ్రజ్యోతి): ఆపరేషన్‌ సింధూర్‌ నేపథ్యంలో భద్రత వ్యవస్థలను కట్టుదిట్టం చేయాలని రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా అన్నారు. గురువారం పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలోని సింగరేణి, ఎన్‌టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌తోపాటు ప్రభుత్వరంగ సంస్థల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కమిషరేట్‌లో నిర్వహించిన సమావేశా నికి డీసీపీలు, ఏసీపీలు పాల్గొన్నారు. సీపీ మాట్లాడుతూ ప్రజలకు భద్రతపై అవగాహన కల్పించడంతోపాటు ప్రభుత్వరంగ సంస్థల ప్రాంతాల్లో అప్రమ త్తంగా ఉంటూ భద్రత వ్యవస్థను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. అన్ని శాఖల యంత్రాంగం సమన్వయం చేసుకుంటూ ఇండస్ర్టియల్‌ సంస్థల వద్ద భద్రతను పెంచాలని, అత్యవసర సర్వీసులు అందించే విభాగాలు, ఉద్యో గులు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. కమిష నరేట్‌ పరిధిలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నిరోధిం చడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డీసీపీలు కరుణాకర్‌, భాస్కర్‌, అడిషనల్‌ డీసీపీ(అడ్మిన్‌) రాజు, సీఐఎస్‌ఎఫ్‌ కమాండర్‌ సుదేష్‌ జక్కర్‌, చందన్‌ కుమార్‌, రాజు, సర్వర్‌, సమత, సింగరేణి జీఎంలు లలిత్‌కుమార్‌, సుదర్శన్‌రావు, వెంకటయ్య, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ అధికారి సోమనాథ్‌తో పాటు ఏసీపీలు, ఫైర్‌ ఆఫీసర్లు, సింగరేణి, ఎన్‌టీపీసీ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2025 | 11:39 PM