పాఠశాల ప్రాంగణాలు పరిశుభ్రంగా ఉండాలి
ABN , Publish Date - Jul 17 , 2025 | 11:43 PM
పాఠ శాల ప్రాంగణాలు పరిశుభ్రంగా ఉంచుకో వాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురు వారం మద్దిర్యాల, పొట్యాల, గోలివాడ, బ్రాహ్మణపల్లి అంగన్వాడీ కేంద్రాలు, మండల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మి కంగా తనిఖీచేశారు.
అంతర్గాం, జూలై 17(ఆంధ్రజ్యోతి): పాఠ శాల ప్రాంగణాలు పరిశుభ్రంగా ఉంచుకో వాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురు వారం మద్దిర్యాల, పొట్యాల, గోలివాడ, బ్రాహ్మణపల్లి అంగన్వాడీ కేంద్రాలు, మండల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మి కంగా తనిఖీచేశారు. పాఠశాలలు పరిశు భ్రంగా ఉండేందుకు పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని హెచ్‌ఎంలను ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాలలో పిల్లలు, గర్భవతులకు అందజేస్తున్న పౌష్ఠికాహారం విషయమై ఆరా తీశారు.
అనంతరం మద్ది ర్యాలలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించి త్వరితగతిన నిర్మా ణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. తహ సీల్దార్ కార్యాలయం సందర్శించి భూ రికా ర్డులను పరిశీలించారు. తహసీల్దార్ రవీందర్ పటేల్, ఎంపీడీవో వేణుమాధవ్, హౌసింగ్ ఈఈ రాజేశ్వర్, ఏఈ దస్తగిరి, పంచాయ తీరాజ్ డీఈ అప్పలనాయుడు పాల్గొన్నారు.