Share News

పాఠశాలల అభివృద్ధి పనులను పర్యవేక్షించాలి

ABN , Publish Date - Nov 15 , 2025 | 11:35 PM

ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి జరిగేలా అధికారులు పర్యవే క్షించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వ హించిన పాఠశాలల పర్యవేక్షణ, బ్యాంక్‌ ఖాతాల నిర్వహణపై జిల్లా అధి కారులతో సమీక్ష చేశారు.

పాఠశాలల అభివృద్ధి పనులను పర్యవేక్షించాలి

పెద్దపల్లి కల్చరల్‌, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి జరిగేలా అధికారులు పర్యవే క్షించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వ హించిన పాఠశాలల పర్యవేక్షణ, బ్యాంక్‌ ఖాతాల నిర్వహణపై జిల్లా అధి కారులతో సమీక్ష చేశారు. జిల్లాలోని పలు శాఖల్లో వినియోగించని బ్యాంకు ఖాతాలలో జమ చేసి ఉన్న డబ్బు ఆర్‌బీఐ నుంచి వెనక్కి తీసుకు నేందుకు కేవైసీ వివరాలు, రిక్వెస్ట్‌ లెటర్‌ అందించాలని ఆయన తెలిపారు.

ఈ నెల 22 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. డిసెంబర్‌ చివరి నాటికి జిల్లాలోని విద్యాసంస్థల్లో మౌలిక వసతుల పనులు పూర్తి చేసే దిశగా రూ.30 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. అధికా రులు రెండు ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసి పనులపై నివేదిక అందించాలన్నారు. రాబోయే ఐదేళ్లలో పాఠశాలల్లో అవసరమైన మేర అభివృద్ధి పనులు జరిగేలా చూడాలని, ఇంకా ఏమైనా పనులు చేపట్టాల్సి ఉంటే ప్రతిపాదనలు సిద్ధం చేస్తే నిధులు అందిస్తామన్నారు.

Updated Date - Nov 15 , 2025 | 11:35 PM