Share News

పాఠశాల అభివృద్ధి పనులను పర్యవేక్షించాలి

ABN , Publish Date - Nov 01 , 2025 | 11:50 PM

ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ దాసరి వేణుతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ శాఖలో వినియోగించని బ్యాంకు ఖాతాలలో నిధులు ఉంటే వాటిని సరి చేసుకోవాలన్నారు.

పాఠశాల అభివృద్ధి పనులను   పర్యవేక్షించాలి

పెద్దపల్లి కల్చరల్‌, నవంబరు1(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ దాసరి వేణుతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ శాఖలో వినియోగించని బ్యాంకు ఖాతాలలో నిధులు ఉంటే వాటిని సరి చేసుకోవాలన్నారు. జిల్లాకు చెందిన రూ.4.5 కోట్ల నిధులను ఉపయోగించని ఖాతాల నుంచి ఆర్‌బీఐ వెనక్కి తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం ఉందని, వాటిని మళ్లీ బ్యాంకు ఖాతాలలో తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం వరకు జిల్లాలోని ప్రభుత్వ శాఖల పరిధిలో ఉపయోగించని బ్యాంకు ఖాతాలు ఏమైనా ఉంటే వాటి వివరాలు అందించాలన్నారు. డిసెంబర్‌ చివరి నాటికి జిల్లాలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో అవసరమైన మౌలిక వస్తువుల పనులు పూర్తి చేసే దిశగా నిధులు మంజూరు చేస్తామన్నారు. కలెక్టరేట్‌ నుంచి సుమారు 30 కోట్ల నిధులు మంజూరు చేసి పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పనులు చేపట్టామన్నారు. జిల్లాఅధికారి రెండు ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసి, అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించాలన్నారు. ఈ సమా వేశంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రీ ప్రైమరీ స్కూల్స్‌ను విజయవంతంగా నిర్వహించాలి

ప్రభుత్వం నూతనంగా చేపట్టిన ప్రీ ప్రైమరీ పాఠశాలలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రీ ప్రైమరీ టీచర్లకు ఓరియంటేషన్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రీప్రైమరీ టీచర్ల ఎంపికలో పారదర్శకత పాటించామని, మెరిట్‌ ఆధారంగా టీచర్ల ఎంపిక జరిగిం దన్నారు. టీచర్లు చిత్తశుద్ధితో పని చేయాలని, పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రాల కంటే మెరుగ్గా విద్యనందించాలన్నారు. విద్యార్థికి ఏకరూప దుస్తులు, ఆట వస్తువులు, ఇతర పరికరాలు నెల రోజుల్లోగా అందు బాటులోకి తీసుకువస్తామన్నారు. టీచర్లు ఓపిక, ఉత్సాహంతో విద్యాబోధన అందించాలన్నారు. డీఈఓ మాధవి, అకాడమిక్‌ మానిట రింగ్‌ అధికారి షేక్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 01 , 2025 | 11:50 PM