Share News

వీధి వ్యాపారులకు స్కానర్ల అందజేత

ABN , Publish Date - Oct 07 , 2025 | 11:31 PM

పట్ట ణంలోని వీధి వ్యాపారులకు డిజిటల్‌ లావాదేవీల కోసం పోస్టాఫీస్‌ జారీ చేసిన క్యూఆర్‌ కోడ్‌ స్కా నర్లను మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌ అంద జేశారు. మంగళవారం బల్దియా కార్యాలయంలో లోక కళ్యాణ్‌ మేళా నిర్వహించారు.

వీధి వ్యాపారులకు స్కానర్ల అందజేత

సుల్తానాబాద్‌, అక్టోబరు7(ఆంధ్రజ్యోతి): పట్ట ణంలోని వీధి వ్యాపారులకు డిజిటల్‌ లావాదేవీల కోసం పోస్టాఫీస్‌ జారీ చేసిన క్యూఆర్‌ కోడ్‌ స్కా నర్లను మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌ అంద జేశారు. మంగళవారం బల్దియా కార్యాలయంలో లోక కళ్యాణ్‌ మేళా నిర్వహించారు. ఇందులో భాగంగా కమిషనర్‌ రమేష్‌ మాట్లాడుతూ ప్రభు త్వ పథకాల పొందడంలో పోస్టాఫీస్‌ సేవలను ఉప యోగించుకోవాలన్నారు. పోస్టల్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రాజేష్‌ మాట్లాడుతూ పేమెంట్‌ బ్యాంక్‌ ద్వారా అంది స్తున్న అకౌంట్‌, జీవన జ్యోతిబీమా, ప్రమాద బీమా, డిజిటల్‌ లావాదేవీలు వినియోగించుకోవాలని సూచిం చారు. మున్సిపల్‌ మేనేజర్‌ అలీమోద్దిన్‌, క్రాంతికుమార్‌, మెప్మా సీఓ స్వరూప, ఆర్‌పీలు, మహిళలు, పోస్టల్‌ సిబ్బంది శ్రీకాంత్‌, మౌనిక, తిరుపతి, పాల్గొన్నారు.

వీధి వ్యాపారులను నమోదు చేయాలి

కోల్‌సిటీ, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): పీఎం స్వనిధి పథకం ప్రయోజనాలు పొందేందుకు వీధి వ్యాపారుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని నగర పాలక సంస్థ అడిషనల్‌ కమిషనర్‌ మారుతి ప్రసాద్‌ అన్నారు. మెప్మా సీఓలు, ఆర్‌పీలతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ చిరు వ్యాపారుల కోసం అమలు చేస్తున్న పీఎం స్వనిధి పథకంలో అర్హులు లబ్ధిపొందేలా అవగాహన కల్పించాలన్నారు. మొదటి విడతలో రూ.10వేలు, రెండో విడత రూ.20 వేలు, మూడవ విడతలో రూ.50వేల రుణం పొందడా నికి అవకాశం ఉంటుందన్నారు. మెప్మా టీఎంసీ మౌని క, సీఓలుఊర్మిళ, శ్వేత, ప్రియదర్శిని, శమంత పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2025 | 11:31 PM